కురుక్షేత్రం (2019)(U/A)
Release date
09 Aug 2019
genre
కురుక్షేత్రం స్టోరి
కన్నడంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన మహాభారత దృశ్య కావ్యం అయిన కురుక్షేత్రం సినిమాను తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. వృషభాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మునిరత్న నిర్మిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ సమర్పిస్తున్నారు. ఇందులో దర్శన్, అంబరీష్, రవిచంద్రన్, నిఖిల్ గౌడ, అర్జున్ సర్జా, స్నేహా ప్రసన్న, హరిప్రియా, సోను సూద్, శశికుమార్, రవిశంకర్ పి, భారతి విష్ణువర్ధన్, మేఘన సుందర్ రాజ్, ప్రగ్య జైశ్వాల్, రమ్య నంభీషన్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగన్న వహించారు. సంగీతం వి హరికృష్ణ అందించారు.
కథ
మహాభారతంలోని పాండవులు, కౌరవుల మధ్య వైరం ప్రధాన అంశంగా కురుక్షేత్రం మూవీ సాగుతుంది. ధుర్యోధనుడు (దర్శన్), కర్ణుడికి (అర్జున్) పట్టాభిషేకం చేయడం, పాండవుల రాజసూయ యాగం సందర్భంగా అవమానానికి గురి కావడంతో దుర్యోధనుడు అహం దెబ్బ తింటుంది. ఆ ఘట్టమే మహాభారత యుద్ధానికి కీలక అంశంగా మారుతుంది.
పాండవులు జూదంలో ఓడిపోవడం, అలాగే కృష్ణరాయబారం, మహాభారత యుద్దం, అభిమన్ముడి పద్మవ్యూహం పోరాటం, తదితర అంశాలు సినిమాలో కీలక అంశాలుగా మారుతాయి. ఇలాంటి ఉద్వేగభరితమైన సన్నివేశాలను సరికొత్తగా 3డీ అనుభూతిని పొందాలంటే తెరపైన కురుక్షేత్రాన్ని వీక్షించాల్సిందే.
**Note:Hey! Would you like to share the story of the movie కురుక్షేత్రం with us? Please send it to us ([email protected]).