X
తెలుగు » సినిమాలు » కురుక్షేత్రం
కురుక్షేత్రం

కురుక్షేత్రం

Mythological | 09 Aug 2019 | U/A | 182 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

కురుక్షేత్రం స్టోరీ

కన్నడంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన మహాభారత  దృశ్య కావ్యం అయిన కురుక్షేత్రం సినిమాను తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. వృషభాద్రి ప్రొడక్షన్స్‌ బ్యానర్ మీద మునిరత్న నిర్మిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ సమర్పిస్తున్నారు. ఇందులో దర్శన్, అంబరీష్, రవిచంద్రన్, నిఖిల్ గౌడ, అర్జున్ సర్జా, స్నేహా ప్రసన్న, హరిప్రియా, సోను సూద్, శశికుమార్, రవిశంకర్ పి, భారతి విష్ణువర్ధన్, మేఘన సుందర్ రాజ్, ప్రగ్య జైశ్వాల్, రమ్య నంభీషన్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగ‌న్న వహించారు. సంగీతం వి హరికృష్ణ అందించారు.  కథ మహాభారతంలోని పాండవులు, కౌరవుల మధ్య వైరం ప్రధాన అంశంగా కురుక్షేత్రం మూవీ సాగుతుంది. ధుర్యోధనుడు (దర్శన్), కర్ణుడికి (అర్జున్) పట్టాభిషేకం చేయడం, పాండవుల రాజసూయ యాగం సందర్భంగా అవమానానికి గురి కావడంతో దుర్యోధనుడు అహం దెబ్బ తింటుంది. ఆ ఘట్టమే మహాభారత యుద్ధానికి కీలక అంశంగా మారుతుంది. పాండవులు జూదంలో ఓడిపోవడం, అలాగే కృష్ణరాయబారం, మహాభారత యుద్దం, అభిమన్ముడి పద్మవ్యూహం పోరాటం, తదితర అంశాలు సినిమాలో కీలక అంశాలుగా మారుతాయి. ఇలాంటి ఉద్వేగభరితమైన సన్నివేశాలను సరికొత్తగా 3డీ అనుభూతిని పొందాలంటే తెరపైన కురుక్షేత్రాన్ని వీక్షించాల్సిందే.
Read More

కురుక్షేత్రం కాస్ట్ & క్రూ

కురుక్షేత్రం సిబ్బంది సమాచారం

దర్శకత్వం నాగ‌న్న
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం వి హరిక్రిష్ణ
నిర్మాత ముణిరత్న
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కురుక్షేత్రం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మహాభారతం సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. గతంలో దానవీరశూరకర్ణ, కురుక్షేత్రం దక్షిణాదిలోనే ఉన్నత ప్రమాణాలకు దీటుగా నిలిచాయి. టెక్నాలజీతో అండతో అలాంటి అంచనాలకు సరితూగేలా ప్రయత్నం చేసిన తీరు అభినందనీయం. వింటే భారతం వినాలే అనే సామెత ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాబట్టి.. తెలుగు ప్రేక్షకుల ఆదరణ భారీగా లభించడానికి అవకాశాలు ఉన్నాయి. నవతరానికి మహాభారతం గురించి తెలియజేయాలంటే సాంకేతికతతో కూడిన కురుక్షేత్రం సినిమా చూడాల్సిందే. బీ, సీ సెంటర్లలో లభించే ఆదరణ బట్టి కమర్షియల్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

కురుక్షేత్రం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కురుక్షేత్రం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+