X
లంక

లంక

Thriller | 21 Apr 2017 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

లంక స్టోరీ

లంక సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాశి, సాయి రోనక్, ఐనా సాహా, సుప్రీత్, సుజ్జు, లీనా సిద్దు, రాజేష్, సత్య, సుదర్శన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని వహించారు మరియు నిర్మాతలు నామన దినేష్-నామన విష్ణు కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరన్ పకల స్వరాలు అందించారు.  కథ స్వాతి(ఐనా సాహ) మళయాలంలో పెద్ద హీరోయిన్. శరత్(సిజ్జూ) అనే వ్యక్తి ద్వారా ప్రమాదం ఉండటంతో అతడి నుండి తప్పించుకుని చర్చి ఫాదర్ సహాయంతో యూఎస్ వెళ్లడానికి హైదరాబాద్ వస్తుంది. అయితే వీసా రావడానికి వారం సమయం ఉండటంతో గ్యాపులో శరత్ కంట పడకుండా ఉండేందుకు సాయి (సాయి రోనక్) అండ్ ఫ్రెండ్స్ తీస్తున్న షార్ట్ ఫిల్మ్ లో నటించేందుకు ఒప్పుకుంటుంది. ఆమె పెద్ద హీరోయిన్ అనే విషయం సాయి అండ్ ఫ్రెండ్స్ కి ఇంకా అప్పటికి తెలియదు. ఊరి చివర ఉన్న బంగ్లాను షూటింగ్ స్పాట్ గా ఎంచుకుంటారు. ఆ బంగ్లాలో రెబెకా విలియమ్స్(రాశి) అనే మహిళ ఉంటుంది. చనిపోయిన తన ఇద్దరు పిల్లలు తనతోనే బ్రతికి ఉన్నట్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంది రెబెకా. ఆమె అలా ప్రవర్తించడం వెనక టెలిపతి అనే అతీత శక్తి అని గ్రహించిన స్వాతి... రెబెకా సహాయంతో తాను కూడా టెలిపతిని నేర్చుకుంటుంది. అసలు టెలిపతి అంటే ఏమిటి? అది నేర్చుకుంటే ఎలాంటి శక్తులు వస్తాయి? స్వాతి ప్రమాదం నుండి ఎలా బయట పడింది? సిజ్జూ ఆమె కోసం ఎందుకు వెతుకుతున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.
Read More

లంక కాస్ట్ & క్రూ

లంక సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీముని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీచరణ్ పాకాల
నిర్మాత నామన దినేష్, నామన విష్ణు కుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లంక విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఒక మనిషి మరో మనిషి మనస్సులోని ఆలోచనను చెప్పగలగడం ఒక విశేష శక్తిగా పేర్కొంటారు. అమెరికాలో ఒకరుంటారు-ఇండియాలో మరో వ్యక్తి వుంటాడు. వారిరువురూ ఫోను సైతం చేసుకోరు. అయినా ఇండియాలో వున్న వ్యక్తి ఒకానొక సమయంలో ఏమి ఆలోచిస్తున్నాడో అదే సమయంలో అ విషయాన్ని అమెరికాలో వున్న వ్యక్తి చెబుతాడు. తరువాత పరిశీలీంచిన వారికి యిది అద్భుతంగా ఇంద్రియాతీతశక్తిగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రక్రియకు టెలిపతి (Telepathy) అని పేరు పెట్టారు. మరికొందరు యీ టెలిపతి శక్తి ద్వారా మరో వ్యక్తి యిష్టానికి వ్యతిరేకంగాను పనిచేయంచవచ్చు. ఒక సాధారణ కథకు టెలిపతి అనే కాన్సెప్టును జోడించి.... సినిమాను డిఫరెంటుగా ప్రజెంట్ చేయాలని దర్శకుడు ప్రయత్నించాడు. అయితే కథను నేరేట్ చేసే క్రమంలో అనేక ఉపకథలు జోడించి ప్రేక్షకులను గంధరగోళానికి గురి చేసాడు. టెలిపతి కాన్సెప్టును కూడా ప్రేక్షకులకు అర్థం అయ్యేలా ప్రజెంట్ చేయలేక పోయాడు. మొదటి నుండి చివరి వరకు సినిమా ఎటు నుండి ఎటు పోతుందో తెలియని అయోమయంలో ప్రేక్షకుడు కొట్టుమిట్టాడే పరిస్థితి. సినిమాలో సస్సెన్స్, ట్విస్టులు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే లేదు.

లంక సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లంక

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+