లైగర్ సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, ఆలీ, గెటప్ శ్రీను, మక్రంద్ దేశ్పాండే, మైక్ టైసన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరీ జగన్నాథ్ వహించారు. నిర్మాతలు చార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మించారు. సంగీతం తనీష్క్ బాగ్చి, సునీల్ కశ్యప్, విక్రమ్ మంట్రోస్ కలిసి అందించారు.
కథ
కరీంనగర్‌కు చెందిన బాలమణి (రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్ (విజయ్ దేవరకొండ)ను మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఛాంపియన్ చేయాలనుకొంటుంది. మార్షల్ ఆర్ట్స్‌లో చాంపియన్ మార్క్ అండర్సన్ (మైక్ టైసన్)ను పిచ్చిగా లైగర్‌ను ఆరాధిస్తుంటాడు. ఈ క్రమంలో ముంబైలోని మార్షల్ ఆర్ట్స్ కోచ్ (రోనిత్ రాయ్) వద్ద లైగర్‌ను చేర్పిస్తుంది. ఇదిలా ఉండగా లైగర్‌ను మొదటి చూపులోనే తానియా (అనన్య పాండే) ప్రేమిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల లైగర్ ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. లైగర్‌తో బ్రేకప్ తర్వాత తానియా ఓ మాఫియా అధినేత చేతిలో కిడ్నాప్‌కు గురి అవుతుంది. బాలమణి తన కొడుకుకు లైగర్ అని పేరు ఎందుకు పెట్టింది? లైగర్‌ను ఎందుకు మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌ను చేయాలనుకొన్నది? లైగర్ ప్రేమను ఎందుకు తానియా రిజెక్ట్ చేసింది? తానియాతో బ్రేకప్ తర్వాత లైగర్ పరిస్థితి ఏమిటి? అమెరికాకు వెళ్లిన లైగర్‌కు మార్క్ అండర్సన్ (మైక్ టైసన్) ఎలాంటి పరిస్థితుల్లో ఎదురుపడ్డాడు. తాను అభిమానించే మార్క్ అండర్సన్‌ను లైగర్ ఎందుకు ఎదురించాల్సి వస్తుంది? తానియాను కిడ్నాప్ ఎవరు చేశారు? కిడ్నాపర్ నుంచి తానియాను లైగర్ ఎలా రక్షించాడు అనే సింపుల్ కథకు సమాధానమే లైగర్ సినిమా కథ.
పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడెక్షన్స్ పతాకంపై ఛార్మి, కరణ్ జోహార్ ఈ చిత్రాన్నినిర్మించారు.
విడుదల
ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.