మగధీర సినిమా పౌరాణిక డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్, కాజల్, దేవ్ గిల్, శ్రీహరి, సూర్య, శరత్ బాబు, సునీల్, బ్రహ్మానందం, హేమ, చిరంజీవి, కిమ్ శర్మ, ముమైత్ ఖాన్, సుబ్బరాయ శర్మ, రావ్ రమేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: యస్.యస్.రాజమౌళి నిర్వహించారు మరియు నిర్మాత అల్లుఅరవింద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన రెండవ చిత్రం మగధీర. మగధీర సినిమా కథ 1609 లో జరిగిన సంఘటన మీద నడుస్తుంది. కథ విషయానికి వస్తే 1609 సంవత్సరం లో కాలభైరవ (రామ్ చరణ్) ఉదయఘర్ సామ్రాజ్యంలో సమరయెధుడు, సైనికులకు శిక్షణ ఇస్తుంటాడు. శేనాధిపతి రణధీర్ (దేవ్ గిల్) యువరాణి మిత్రవింద(కాజల్) పై ఆశపడతాడు, కానీ మిత్రవింద కాలభైరవను ప్రేమిస్తుంది. పర్యావసానంగా కాలభైరవ మరియు రణధీర్ ల మధ్య యుధ్ధం జరిగి వారు ప్రాణాలు కోల్పోతారు. ఉదయఘర్ పై దండెత్తిన షేర్ ఖాన్(శ్రీహరి) కూడా పోరాటంలో ప్రాణాలు కోల్పోతాడు. ఇలా చనిపోయిన వారు హర్ష(రామ్ చరణ్), ఇందు(కాజల్) గా పునర్జన్మలో ప్రేమించుకొంటారు, ఇప్పుడు కూడా పూర్వజన్మలోని పాత్రలు తారసపడతాయి. మిగిలిన కథ వారెలా తమ పూర్వజన్మను తెలుసుకున్నారు, ఎలా వారి ప్రేమను గెలిపించుకున్నారు అనేది మిగతా కథ.