X
తెలుగు » సినిమాలు » మళ్ళి మళ్ళి ఇది రాని రోజు
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు

Romance | 06 Feb 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు స్టోరీ

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వనంద్, నిత్య మినన్ తదితురులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రాంతి మాదవ్ నిర్వహించారు మరియు నిర్మాత అలెక్జాండర్ నిర్మించారు. కథ రన్నర్... రాజారాం(శర్వానంద్) జీవితాశయం నేషనల్ లెవిల్లో గోల్డ్ మెడల్. ఆ సాధన చేస్తూ ఖాళీ సమయంలో ... తన కాలేజీలో చదివే ముస్లిం అమ్మాయి నజీర(నిత్యామీనన్) ని ప్రేమిస్తాడు. మతాలు వేరైనా మనస్సులు కలిసాయని ఇద్దరూ ప్రేమని కంటిన్యూ చేస్తారు...అంతేకాక ఆమె తన ముఖం చూపకుండా అతని లక్ష్యానికి అన్ని విధాలా సాయబడి అతని ఆశయం నెరవేరేలా చేస్తుంది. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకునే సమయంలో అనుకోని పరిస్ధితుల్లో విడిపోతారు. విధికి తలొగ్గి తమ ప్రేమను సాఫల్యం చేసుకోలేకపోయిన ఈ జంట ఇరవైయేళ్ల తర్వాత కలుసుకుంటారు. అప్పుడు వారి భావోద్వేగాలు ఎలా వుంటాయి? జీవన గమనంలో వారి దృక్పథాల్లో వచ్చిన మార్పులేమిటి? వారు కలుసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? వారి బంధం చివరకు ఏ తీరాలకు చేరింది? తర్వాత ఏం జరిగింది. అసలు వీరు విడిపోయే పరిస్ధితులు ఏమి వచ్చాయి ..ఈ ప్రశ్నలన్నింటికీ అందమైన దృశ్యరూపమే చిత్ర కథ
Read More

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు కాస్ట్ & క్రూ

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు సిబ్బంది సమాచారం

దర్శకత్వం క్రాంతి మాదవ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత అలెక్జాండర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫీల్ గుడ్ సినిమాలు మనకు అప్పడప్పుడూ వస్తూంటాయి కానీ రెగ్యులర్ గా రావు. అయితే శర్వానంద్ మాత్రం అలాంటి చిత్రాలుకు స్వాగతం పలుకుతూనే ఉన్నారు. రన్ రాజా రన్ వంటి కమర్షియల్ హిట్ చిత్రం తర్వాత చేసిన ఈ చిత్రం క్లాస్ ప్రేక్షకులకు బాగుందనిపించేలా...స్లోగా...ఫీల్ తో సా........గింది. ఓ అందమైన ప్రేమ కధగా చిత్రాన్ని తీర్చి దిద్దాలనే దర్శకుడి తాపత్రయం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ఓ వర్గానికి మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తే...మరికొందరకి ఒక్కసారి చూడటమే కష్టమిపిస్తుంది. ఫస్టాఫ్ రన్ బాగుందనిపించినా సెకండాఫ్ కు వచ్చేసరికి అది మరింత స్లో అయ్యిపోయింది. అక్కడక్కడా సీన్స్ చూస్తూంటే ఏదో మళయాళ చిత్రం చూసినట్లు అనిపించినా సీన్స్ లోని కంటంట్ తో దాన్ని అధిగమిస్తాడు. ఇవన్నీ ప్రక్కన పెడితే నిత్యామీనన్ అభిమానులకు ఇది పండుగ చేసుకునే సినిమానే. ఈ సినిమాలో తన ప్రతిభను మరోసారి సినిమాకు ప్లస్ అయ్యేలా చేసింది. మంచి విజువల్స్ కోసం, చక్కటి డైలాగ్స్ కోసం...కాస్త స్లో అయినా ఫరవాలేదు...మన పాత ప్రేమ కథలను గుర్తు చేసుకుందామనుకునే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్.

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+