X
తెలుగు » సినిమాలు » మంచిరోజులు వచ్చాయి
మంచిరోజులు వచ్చాయి

మంచిరోజులు వచ్చాయి

Romance | 04 Nov 2021 | U/A | 144 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

మంచిరోజులు వచ్చాయి స్టోరీ

మంచిరోజులు వచ్చాయి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభన్, మెహ్రీన్ పిర్జాదా, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, వివా హర్ష, సుదర్శన్, సప్తగిరి, సుదర్శన్, అజయ్ గోష్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం మారుతి వహించారు. నిర్మాత శ్రీనివాస కుమార్ నిర్మించారు సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు.  కథ జీవితాన్ని చాలా సంతోషంగా ఆస్వాదించే గోపాలం (అజయ్ ఘోష్)కు కూతురు పద్మ (మెహ్రీన్ ఫిర్జాదా)ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. తన కూతురు పెంపకం, జీవితానికి సంబంధించిన విషయంలో అనేక భయాలను మనసులో పెట్టుకొని జీవిస్తుంటాడు. అయితే బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేసే పద్దు తన తోటి ఉద్యోగి (సంతోష్)తో ప్రేమలో ఉంటుంది. ఇదిలా ఉండగా, హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో తన కాలనీలోని స్నేహితులు పాలసీ మూర్తి (శ్రీనివాసరావు), కోటేశ్వరరావులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కూతురు పద్దు ప్రేమ విషయంలో గోపాలానికి లేనిపోని అనుమానాలు కలిగిస్తారు. కూతురుపై అనుమానాలను పెంచుకొన్న గోపాలం.. పద్దు, సంతూ ప్రేమకు అడ్డుగా నిలుస్తాడు. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కూతురుపై ఎలాంటి పరిస్థితుల్లో గోపాల అనుమానాలు పెంచుకొంటాడు. జీవితంలో అతిభయం ఉండటం కారణంగా గోపాలంకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. తన కూతురుకు మంచి భర్తను తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. తన ప్రియురాలు పద్దు ప్రేమను కాపాడుకోవడానికి గోపాలాన్ని సంతోష్ ఎలా మెప్పించేందుకు ప్రయత్నం చేశాడు. స్వచ్ఛమైన మనసు ఉన్న గోపాలం బుర్రలో పాలసీ మూర్తి ఎలాంటి అనుమానం బీజాలను నాటాడు? గోపాలం మనసులో పాలసీ మూర్తి ఎందుకు భయాన్ని సృష్టించాలనుకొంటాడు? చివరకు అతిభయం అనే లక్షణాన్ని గోపాలం వదిలించుకొన్నాడా? పద్దు, సంతోష్ ప్రేమను ఎలాంటి పరిస్థితుల్లో అంగీకరించాడు అనే ప్రశ్నలకు వినోదాత్మకంగా చెప్పిన సమాధానాలే మంచి రోజులు వచ్చాయి సినిమా కథ.
Read More

మంచిరోజులు వచ్చాయి కాస్ట్ & క్రూ

మంచిరోజులు వచ్చాయి సిబ్బంది సమాచారం

దర్శకత్వం మారుతి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత శ్రీనివాస కుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మంచిరోజులు వచ్చాయి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
అతిభయం అనే చిన్న పాయింట్‌ను తీసుకొని దాని చుట్టూ ఫ్యామిలీ వ్యాల్యూస్, లవ్, కామెడీ లాంటి అంశాలను జోడించి పక్కాగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా మలిచిన చిత్రం మంచి రోజులు వచ్చాయి. కథ, కథనాలు రొటీన్‌గా ఉండటం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. గోపాలం తన తల్లి వద్దకు వెళ్లి పడుకోవడం, అలాగే కూతురు కోసం గోపాలం పడే తపన లాంటి కొన్ని సీన్లలో ఎమోషన్స్ ఆకట్టుకొంటాయి. దీపావళీకి మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అందించాలనే నిర్మాతల ప్రయత్నం సఫలమైందనే చెప్పవచ్చు. లాజిక్స్‌ను పక్కన పెట్టి.. పండుగ వేళ వినోదాన్ని పొందాలనుకొనే వారికి మంచి రోజులు వచ్చాయి సినిమా మంచి అనుభూతిని అందిస్తుంది.

మంచిరోజులు వచ్చాయి ట్రైలర్

Video Thumbnail

మంచిరోజులు వచ్చాయి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మంచిరోజులు వచ్చాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+