మను చరిత్ర సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శివ కందుకూరి, మేఘ ఆకాష్, ప్రియా వడ్లమని, ధనంజయ్, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, మధు సుదన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భరత్ పెదగని వహించారు. నిర్మాతలు ఎన్ శ్రీనివాస రెడ్డి, పి రొంన్సన్ కలిసి నిర్మించారు. సంగీతం గోపి సుందర్ అందించారు.
కథ
మను (శివ కందుకూరి) చదువుల్లో ఫస్ట్ ర్యాంక్ సత్తా ఉన్న విద్యార్థి. శ్రావ్య (ప్రియ వడ్లమాని), ప్రియ, ఇంకా చాలా మంది అమ్మాయిలను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతాడు. వాళ్లు మను లవ్ ప్రపోజల్ అంగీకరించిన తర్వాత వారికి బ్రేకప్ చెబుతుంటాడు. జెన్నీఫర్ (మేఘా ఆకాష్( గురించి ఆలోచిస్తూ అనుక్షణం మద్యం మత్తులో తూలుతుంటాడు. ఇదిలా ఉండగా వరంగల్‌లో ఊహించిన విధంగా హత్యలు జరుగుతుంటాయి. స్టడీస్‌లో టాప్ ర్యాంకర్ అయిన మను ఎందుకు? ఎలా దారి తప్పాడు? కాలికట్ ఐఐటీలో సీటు వచ్చినా ఎందుకు వదులుకొన్నాడు? మను జీవితాన్ని జెన్నిఫర్ ఎలా మలుపుతిప్పింది. జెన్నిఫర్‌కు మను ఎందుకు దూరమయ్యాడు? తన జీవితంలోకి వచ్చిన స్కూల్ టీజర్ జాను (ప్రగతి శ్రీవాత్సవ్)కు మను ఎలాంటి ప్రేమను పంచాడు? జాను లవ్ ప్రపోజల్‌ను మను అంగీకరించాడా? వరంగల్ మేయర్, ఇతర వ్యక్తుల హత్యల వెనుక కారణం ఏమిటి? రౌడీ రుద్ర (ధనుంజయ్) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మను చరిత్ర సినిమా కథ.
ట్రైలర్ విషయానికొస్తే..
మూవీలో హీరో(శివ కందుకూరి) తన లైఫ్ లో ఒక్కో దశలో ఒక్కో అమ్మాయితో ప్రేమలో పడుతూ ఉంటాడు. తర్వాత కొన్ని కారణాల వలన మళ్లీ వాళ్లకు బ్రేకప్ చెప్తాడు. మరోవైపు అతనిపై కొంతమంది ఎటాక్ చేస్తూ ఉంటారు. హీరో తను ప్రేమించిన అమ్మాయిలతో ఎందుకు విడిపోతున్నాడు? అతని ప్రేమలో లోపాలు ఏంటి? హీరోపై ఎటాక్ చేస్తున్న గ్యాంగ్ ఎవరు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? చివరకు హీరో ప్రేమ ఏమైంది లాంటి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో మూవీను తెరకెక్కించినట్టున్నారు మేకర్స్.
విడుదల
మను చరిత్ర మూవీను జూన్ 23 న విడుదల చేయనున్నారు.