X
మెంటల్ మదిలో
Romance | 24 Nov 2017 |
Telugu

మెంటల్ మదిలో స్టోరీ

మెంటల్ మదిలో సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు శ్రీ విష్ణు, నివేథ పెతురాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వివేక్ ఆత్రేయ వహించారు మరియు నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి స్వరలు సమకుర్చరు. 

కథ

అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి ప్రతీ విషయంలోనూ కన్ఫ్‌ఫ్యూజన్ (తికమకపడటం) కలిగిన వ్యక్తి. ఆడవాళ్లకు ఆమడదూరంలో ఉంటాడు. ఇలాంటి లక్షణాలు ఉన్న అరవింద్‌కు స్వేచ్ఛ (నివేదా పేతురాజ్)‌తో పెళ్లి కుదురుతుంది. స్వేచ్ఛ ఆధునిక భావాలు ఉన్న మహిళ. తనపై తనకు పూర్తి క్లారిటీ ఉన్న యువతినే కాక ఎదుటివారికి ఏమి కావాలనే స్పష్టత కూడా స్వేచ్ఛకు ఉంటుంది. ఇలాంటి భిన్న లక్షణాలు ఉన్న ఇద్దరు ఒకరిని మరొకరు బాగా ఇష్టపడుతారు. వీరిద్దరి నిశ్చితార్థానికి ముహుర్తం పెట్టుకొంటారు. కానీ ఓ కారణంగా ఎంగేజ్‌మెంట్ ఆగిపోతుంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ పనిమీద అరవింద్‌ ముంబైకి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా ఎంగేజ్‌మెంట్ కాకుండా పెళ్లి రద్దు చేసుకొందామా? అని స్వేచ్ఛను అరవింద్ అడగుతాడు. దాంతో స్వేచ్ఛ ఒక్కసారిగా కంగుతింటుంది. పెళ్లి విషయంలో అరవింద్ తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటి? తాను అమితంగా ఇష్టపడిన స్వేచ్ఛను ఎందుకు దూరం చేసుకోవాలనుకొంటాడు. చివరికి అరవింద్, స్వేచ్ఛ పెళ్లి చేసుకొన్నారా? ఒకవేళ స్వేచ్ఛ, అరవింత్ పెళ్లి చేసుకొంటే ఎలాంటి నాటకీయ పరిణామాలు వారిద్దరి మధ్య చోటుచేసుకొన్నాయి అని ప్రశ్నలకు సమాధానమే Mental మదిలో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+