X
తెలుగు » సినిమాలు » మెంటల్ మదిలో
మెంటల్ మదిలో

మెంటల్ మదిలో

Romance | 24 Nov 2017 |
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

మెంటల్ మదిలో స్టోరీ

మెంటల్ మదిలో సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు శ్రీ విష్ణు, నివేథ పెతురాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వివేక్ ఆత్రేయ వహించారు మరియు నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి స్వరలు సమకుర్చరు.  కథ అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి ప్రతీ విషయంలోనూ కన్ఫ్‌ఫ్యూజన్ (తికమకపడటం) కలిగిన వ్యక్తి. ఆడవాళ్లకు ఆమడదూరంలో ఉంటాడు. ఇలాంటి లక్షణాలు ఉన్న అరవింద్‌కు స్వేచ్ఛ (నివేదా పేతురాజ్)‌తో పెళ్లి కుదురుతుంది. స్వేచ్ఛ ఆధునిక భావాలు ఉన్న మహిళ. తనపై తనకు పూర్తి క్లారిటీ ఉన్న యువతినే కాక ఎదుటివారికి ఏమి కావాలనే స్పష్టత కూడా స్వేచ్ఛకు ఉంటుంది. ఇలాంటి భిన్న లక్షణాలు ఉన్న ఇద్దరు ఒకరిని మరొకరు బాగా ఇష్టపడుతారు. వీరిద్దరి నిశ్చితార్థానికి ముహుర్తం పెట్టుకొంటారు. కానీ ఓ కారణంగా ఎంగేజ్‌మెంట్ ఆగిపోతుంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ పనిమీద అరవింద్‌ ముంబైకి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా ఎంగేజ్‌మెంట్ కాకుండా పెళ్లి రద్దు చేసుకొందామా? అని స్వేచ్ఛను అరవింద్ అడగుతాడు. దాంతో స్వేచ్ఛ ఒక్కసారిగా కంగుతింటుంది. పెళ్లి విషయంలో అరవింద్ తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటి? తాను అమితంగా ఇష్టపడిన స్వేచ్ఛను ఎందుకు దూరం చేసుకోవాలనుకొంటాడు. చివరికి అరవింద్, స్వేచ్ఛ పెళ్లి చేసుకొన్నారా? ఒకవేళ స్వేచ్ఛ, అరవింత్ పెళ్లి చేసుకొంటే ఎలాంటి నాటకీయ పరిణామాలు వారిద్దరి మధ్య చోటుచేసుకొన్నాయి అని ప్రశ్నలకు సమాధానమే Mental మదిలో.
Read More

మెంటల్ మదిలో కాస్ట్ & క్రూ

మెంటల్ మదిలో సిబ్బంది సమాచారం

దర్శకత్వం వివేక్ ఆత్రేయ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాత రాజ్ కందుకూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మెంటల్ మదిలో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
Mental మదిలో చిత్రం చాలా సింపుల్ అండ్ క్యూట్ స్టోరీ లైన్. ప్రతీ సన్నివేశంలో మన చుట్టూ కనిపించే సన్నివేశాలే తెర మీద కనిపిస్తుంటాయి. మధ్య తరగతి కుటుంబంలో కనిపించే భావోద్వేగ సన్నివేశాలు, ఆలోచనలను దర్శకుడు వివేక్ ఆత్రేయ చాలా సున్నితంగా తెరకెక్కించారు. చాలా అందంగా అల్లుకొన్న సన్నివేశాలకు హాస్యాన్ని చక్కగా అద్దారు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు పెదవి మీద చిరునవ్వు చెరగకుండా ప్రేక్షకుడిని కథలో ఎంగేజ్ చేయడం దర్శకుడు విజయం సాధించాడని చెప్పవచ్చు. ప్రతీ పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దాడు. ఏ పాత్ర కూడా ప్రేక్షకుడిని వదిలిపెట్టకుండా వెంటాడుతూ ఉండటం Mental మదిలో ప్రత్యేకత. శేఖర్ కమ్ముల ఆనంద్, గోదావరి, ఫిదా, తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు లాంటి చిత్రాలను మైమరిపించే విధంగా ఈ చిత్రం ఎంత గొప్పగా తెరకెక్కించారంటే అతిశయోక్తి కాదేమో. ఓ చిన్న స్టోరీలైన్ ఎలాంటి ట్విస్టులు లేకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సినిమాను పరుగులు పెట్టించాడు.

మెంటల్ మదిలో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మెంటల్ మదిలో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+