మిస్టర్ 7 సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జునియర్ ఎస్ వి రంగా రావు, నీలం, చలపతి రావు, ఎ వి ఎస్, శ్రీనివాస్ రెడ్డి, గుండు హానుమంత రావు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చరణ్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత ఎస్ వి ఎల్ ఆర్ రంగా రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మున్న కషి స్వరాలు సమకుర్చరు.
కథ
లక్ష్మణ్ (జూ ఎస్వీఆర్) ఒక అనాథ. ఈ క్రమంలో దొంగగా మారి తన చిన్న నాటి స్నేహితుడు అంజి(శ్రీనివాసరెడ్డి)తో కలిసి కార్లు దొంగతనం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లోకి పేరుమోసిన గ్యాంగ్ స్టర్ నాయక్(సత్యదేవ్) ఎంటర్ అవుతాడు. బ్యాంకును దోపిడీ చేయాలనేది అతని లక్ష్యం. లోకల్ దొంగలను చేరదీసి బ్యాంకును కొల్లగొట్టి తన పని అయిపోయాక వారిని చంపేస్తాడు. మరో వైపు లక్ష్మణ్ నక్షత్ర(నీలం)తో ప్రేమలో పడతాడు. తన కూతురిని నిజాయితీగా బతికేవాడికే ఇచ్చి పెళ్లి చేస్తానని నక్షత్ర తండ్రి చెప్పడంతో చివరిసారిగా పెద్ద దొంగతనం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో మెర్సిడీస్ బెంజ్ కారును దొంగిలిస్తాడు. అందులో నాయక్ దోపిడీ చేసిన సొమ్ము ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాతి కథ.