X
తెలుగు » సినిమాలు » మిస్టర్ 7
మిస్టర్ 7

మిస్టర్ 7

Action | Romance | 03 Aug 2012 | U/A |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

మిస్టర్ 7 స్టోరీ

మిస్టర్ 7  సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జునియర్ ఎస్ వి రంగా రావు, నీలం, చలపతి రావు, ఎ వి ఎస్, శ్రీనివాస్ రెడ్డి , గుండు హానుమంత రావు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చరణ్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత ఎస్ వి ఎల్ ఆర్ రంగా రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మున్న కషి స్వరాలు సమకుర్చరు.   కథ లక్ష్మణ్ (జూ ఎస్వీఆర్) ఒక అనాథ. ఈ క్రమంలో దొంగగా మారి తన చిన్న నాటి స్నేహితుడు అంజి(శ్రీనివాసరెడ్డి)తో కలిసి కార్లు దొంగతనం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లోకి పేరుమోసిన గ్యాంగ్ స్టర్ నాయక్(సత్యదేవ్) ఎంటర్ అవుతాడు. బ్యాంకును దోపిడీ చేయాలనేది అతని లక్ష్యం. లోకల్ దొంగలను చేరదీసి బ్యాంకును కొల్లగొట్టి తన పని అయిపోయాక వారిని చంపేస్తాడు. మరో వైపు లక్ష్మణ్ నక్షత్ర(నీలం)తో ప్రేమలో పడతాడు. తన కూతురిని నిజాయితీగా బతికేవాడికే ఇచ్చి పెళ్లి చేస్తానని నక్షత్ర తండ్రి చెప్పడంతో చివరిసారిగా పెద్ద దొంగతనం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో మెర్సిడీస్ బెంజ్ కారును దొంగిలిస్తాడు. అందులో నాయక్ దోపిడీ చేసిన సొమ్ము ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాతి కథ.
Read More

మిస్టర్ 7 కాస్ట్ & క్రూ

మిస్టర్ 7 సిబ్బంది సమాచారం

దర్శకత్వం చరణ్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మున్నా కాశి
నిర్మాత ఎస్ వి ఎల్ ఆర్ రంగా రావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మిస్టర్ 7 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
హీరోగా ఫస్ట్ ఎటెమ్ట్ లో జూ ఎస్వీర్ మంచి ప్రతిభ కనబరిచాడు. సినిమాలపై అతని ఉన్న మక్కువ ఈ చిత్రం చూస్తే స్పష్టం అవుతుంది. నీలం ఉపాధ్యాయ అందంగా కనిపించడంతో నటనలోనూ ఫర్వాలేదనిపించింది. అయితే హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేక పోవడంతో కేవలం పాటలకు, రొమాన్స్ కు మాత్రమే పరిమితం అయింది. శ్రీనివాసరెడ్డి తనదైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విలన్ పాత్రలో సత్యదేవ్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఎమ్మెస్, జీవా పలు చోట్ల హాస్యం పండించారు. ఇతర నటీనటులు వారి పాత్రలకు అనుగుణంగా రాణించారు. రచన మౌర్య ఐటం సాంగు యావరేజ్. కథ కాస్త ఫర్వాలేదనిపించినా, స్క్కీప్లే మైనస్ గా మారింది. దర్శకుడు ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోవడం, సైడ్ యాక్టర్స్ తో ఎంటర్ టైన్మెంట్ చోటివ్వడంతో సినిమా కాస్త ఫర్వాలేదు అనినిపిస్తుంది. హీరోగా జూనియర్ ఎస్వీఆర్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బాడీ బరువుని తగ్గించుకుని, డైలాగ్ డెలివరీ విషయంలో మంచి పట్టు సాధిస్తే భవిష్యత్ ఉంటుంది. ఫైనల్ గా ఈచిత్రం గురించి చెప్పాల్సి వస్తే దొంగగా నటించిన జూ ఎస్వీఆర్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల మనసును మాత్రం దోచుకోలేక పోయాడని చెప్పక తప్పదు.

మిస్టర్ 7 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

మిస్టర్ 7

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+