ప్రస్థానం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, రూబి పరిహార్, సందీప్ కిషన్, కిషోర్, జయప్రకాష్ రెడ్డి, జీవా, పవిత్రా లోకేష్, సురేఖావాణి తదితరులు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా నిర్వహించారు మరియు నిర్మాత రవి వల్లభనేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహేష్ సంకర్ స్వరాలు సమకుర్చారు.
కథ
ఇది ఓ ఇద్దరు సవతి అన్నదమ్ముల పోరాటం కథ. అలాగే ఓ సవతి తండ్రి కథ. మిత్ర (శర్వానంద్) చిన్నప్పుడే తండ్రి ని కోల్పోతాడు. ఆ సమయంలో తండ్రి అనుచరుడుగా ఉండే లోకనాథం నాయుడు (సాయికుమార్) అతని తల్లిని పెళ్ళాడి మిత్రాకు మారుటి తండ్రి అవుతాడు. అయితే అది మిత్ర అక్క (సురేఖా వాణి) కి సుతారామూ ఇష్టం ఉండదు. మరో ప్రక్క మిత్ర తల్లికి, మారుటి తండ్రికి పుట్టిన వాడు చిన్నా(సందీప్). కాలగమనంలో స్ధానిక ఎమ్మల్యే గా ఎదిగిన మారుటి తండ్రిని ఇష్టపడి అతని అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాలు,సెటిల్ మెంట్స్ చేసుకుంటూ గడపుతున్న మిత్రాని అతని సవితి తమ్ముడు చిన్నా ద్వేషంతో అడ్డుకుంటూంటాడు. అంతేగాక చిన్నా ఓ హత్య కేసులో ఇరుక్కుని బయిటకు రావటానికి తన తండ్రి రాజకీయ ప్రత్యర్ధులతో చేతులు కలుపుతాడు. అలాగే తన సొంత తండ్రి రాజకీయ వారసత్వం అప్పచెప్పలేదని, ప్రతీకారంగా తన అక్కని, బావని దారుణంగా చంపేస్తాడు. ఇవన్నీ చూస్తూ తట్టుకోలేక ఎదురుతిరిగిన మిత్రాకు ఓ దారుణమైన నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి...అది తెలిసాక జరిగే పర్యవసానాలు ఏమిటీ అన్నది తెరపై చూడాల్సిందే.