X
తెలుగు » సినిమాలు » ప్రస్థానం
ప్రస్థానం

ప్రస్థానం

Action | Drama | 16 Apr 2010 | U |
Telugu

2.8 /5 Users

2 /5 Filmibeat

ప్రస్థానం స్టోరీ

ప్రస్థానం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్‌, రూబి పరిహార్‌, సందీప్‌ కిషన్‌, కిషోర్‌, జయప్రకాష్‌ రెడ్డి, జీవా, పవిత్రా లోకేష్‌, సురేఖావాణి తదితరులు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా నిర్వహించారు మరియు నిర్మాత రవి వల్లభనేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహేష్ సంకర్ స్వరాలు సమకుర్చారు. కథ ఇది ఓ ఇద్దరు సవతి అన్నదమ్ముల పోరాటం కథ. అలాగే ఓ సవతి తండ్రి కథ. మిత్ర (శర్వానంద్‌) చిన్నప్పుడే తండ్రి ని కోల్పోతాడు. ఆ సమయంలో తండ్రి అనుచరుడుగా ఉండే లోకనాథం నాయుడు (సాయికుమార్‌) అతని తల్లిని పెళ్ళాడి మిత్రాకు మారుటి తండ్రి అవుతాడు. అయితే అది మిత్ర అక్క (సురేఖా వాణి) కి సుతారామూ ఇష్టం ఉండదు. మరో ప్రక్క మిత్ర తల్లికి, మారుటి తండ్రికి పుట్టిన వాడు చిన్నా(సందీప్). కాలగమనంలో స్ధానిక ఎమ్మల్యే గా ఎదిగిన మారుటి తండ్రిని ఇష్టపడి అతని అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాలు,సెటిల్ మెంట్స్ చేసుకుంటూ గడపుతున్న మిత్రాని అతని సవితి తమ్ముడు చిన్నా ద్వేషంతో అడ్డుకుంటూంటాడు. అంతేగాక చిన్నా ఓ హత్య కేసులో ఇరుక్కుని బయిటకు రావటానికి తన తండ్రి రాజకీయ ప్రత్యర్ధులతో చేతులు కలుపుతాడు. అలాగే తన సొంత తండ్రి రాజకీయ వారసత్వం అప్పచెప్పలేదని, ప్రతీకారంగా తన అక్కని, బావని దారుణంగా చంపేస్తాడు. ఇవన్నీ చూస్తూ తట్టుకోలేక ఎదురుతిరిగిన మిత్రాకు ఓ దారుణమైన నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి...అది తెలిసాక జరిగే పర్యవసానాలు ఏమిటీ అన్నది తెరపై చూడాల్సిందే.
Read More

ప్రస్థానం కాస్ట్ & క్రూ

ప్రస్థానం సిబ్బంది సమాచారం

దర్శకత్వం దేవా కట్టా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మహెష్ శంకర్
నిర్మాత రవి వల్లభనేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ప్రస్థానం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రాజా, పార్వతి మిల్టన్ ల వెన్నెల చిత్రంతో సినీ ప్రస్ధానం ప్రారంభించిన దర్శకుడు దేవకట్టా...మలి ప్రయత్నం ప్రస్ధానం నిరాశపరిచిందనే చెప్పాలి. పూర్తి రాజకీయ వాతావరణంలో ఓ ఫ్యామిలీ డ్రామాను పండించాలనే ఉద్దేశ్యంతో మలిచిన ఈ చిత్రంలో కథ ఓ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో కదలక, అన్ని పాత్రలవైపూ కదులుతూ ఎవర్ని ఫాలో కావాలో తెలియని స్ధితికి తెచ్చింది. దాంతో ప్రధాన పాత్ర(శర్వానంద్) ప్యాసివ్ గా మారిపోయింది. దానికి తోడు క్లైమాక్స్ దాకా ఎక్కడా హీరో కి ప్రధాన సమస్య ఇది తెలిసి యాక్టివ్ గా పార్టిసిపేషన్ తీసుకునే మూవ్ మెంట్ రాదు. దాంతో ఎంతో ఆశించి చేసిన డ్రామా మొత్తం డ్రామాలా మారి...ప్రేక్షకులకు సహన పరీక్షగా మారింది. దాంతో శర్వానంద్ బాగా చేసినా, దర్శకుడు టేకింగ్ బాగున్నా, మిగతా విభాగాలు కష్టపడ్డా బూడిదలో పోసిన పన్నీరులా మారిన ఫీలింగ్ వచ్చేసింది.

ప్రస్థానం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.8 /5 Your Rating

ప్రస్థానం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+