రచ్చ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ తేజ్, తమన్నా, నాజర్, కోటశ్రీనివాసరావు, ముఖేష్ రుషి, పార్తీబన్, బ్రహ్మానందం, అలీ, గీత, ఝాన్సీ, ప్రగతి, సుధ, హేమ అజ్మల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ నంది నిర్వహించారు మరియు నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
బెట్టింగ్ రాజ్(రామ్ చరణ్) ఎప్పటిలాగే బెట్టింగ్ లు కడుతూ కుటుంబాన్ని లాక్కొస్తూంటాడు. అయితే అనుకోకుండా అతని పెంపుడు తండ్రి(ఎమ్.ఎస్ నారాయణ)తెగ తాగి లివర్ పాడుచేసుకుంటే ఆపరేషన్ కి ఇరవై లక్షలు అవసరమవుతాయి. అంత పెద్ద ఎమౌంట్ కోసం హీరో అతి పెద్ద బెట్ కి సిద్దమవుతాడు. చైత్ర(తమన్నా) అనే టైట్ సెక్యూరిటీ ఉన్న కోటీశ్వరురాలు కూతురుని లవ్ లో పడేస్తానని పందెం కాస్తాడు. అందుకోసం అతను రాత్రింబవళ్లూ ఆమె చుట్టూ తిరిగి... ఆమెను ఆకట్టుకోవటం కోసం సాహసాలు చేస్తూ.. పాటలు పాడుతూంటాడు. సరిగ్గా పందెం గెలచామనుకునే సమయానికి అతనికో నిజం తెలుస్తుంది. అక్కడ నుంచి కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ చైత్ర ఎవరు... ఏంటా నిజం అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.