రెడ్ సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ పోతినేని, మాళవిక శర్మ, నివేత పేతురాజ్, అమ్రిత అయ్యర్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్, సత్యం రాజేష్, పోసాని కృష్ణ మురళి, నాజర్ తదితరులు నటించారు. ఈ సినిమాని తిరుమల కిశోర్ వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు అందించారు.
కథ
రామ్ ఈ సినిమాలో ఆదిత్య, సిద్ధార్థ్ అనే రెండు పాత్రల్లో నటించాడు. సిద్ధార్థ్ వృత్తిరీత్యా ఇంజనీర్ కాగా, ఆదిత్య ఒక కొన్ని నెగిటివ్ షేడ్స్ తో మోసాలు చేస్తుంటా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఒకరోజు ఆకాష్ అనే యువకుడి హత్య వలన మొదట ఒక ఆధారం ద్వారా సిద్దార్థ్ ను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అనంతరం ఆదిత్య కూడా ఇదే కేసులో చిక్కుకుంటాడు. ఇక అసలు హంతకుడు ఎవరనే పాయింట్ మీదే మిగతా కథ మొత్తం నడుస్తుంది. అసలు మొదట సిద్దార్థ్ ను పట్టుకున్న పోలీసులకు అనుకోకుండా కేసులో అదిత్యను ఎందుకు లాగాల్సి వస్తుంది. ఆకాష్‌ను ఎవరు చంపారు? అసలు సిద్దార్థ్, ఆదిత్య ఇద్దరు ఒకేలా ఎందుకు ఉంటారు? వాళ్ల ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? పోలీసులకు దొరికిన ఆధారాలు ఏమిటి? అనే ఎన్నో ప్రశ్నలతో ట్విస్టులను క్రియేట్ చేస్తుంది ఈ కథ. ఈ సమాధానాలు తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే.