X
శమంతకమణి
Action | Romance | 14 Jul 2017 | U |
Telugu

శమంతకమణి స్టోరీ

శమంతకమణి సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది, సుమన్, చాందిని చౌదరి, జెన్నీ హనీ, అనన్య సోని, నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది, సుమన్, చాందిని చౌదరి, జెన్నీ హనీ, అనన్య సోని, ఇంద్రజ, సస్తూరి, తనికెళ్ల భరణి, హేమ, సురేఖా వాణి, సత్యం రాజేష్, బెనర్జీ, అదుర్స్ రఘు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీ రామ్ ఆదిత్య వహించారు మరియు భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ స్వరాలు అందించారు. 

కథ

హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త జగన్నాథం (సుమన్) కుమారుడు కృష్ణ ( సుధీర్ కుమార్). చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో తల్లిని పోగొట్టుకొన్న కృష్ణ ఆమె జ్ఙాపకాలతోనే జీవితాన్ని నెట్టుకొస్తుంటాడు. కోటిపల్లి అనే గ్రామంలో థియేటర్ నడిపే శివ ( సందీప్ కిషన్) ప్రియురాలి మోసానికి గురై పట్నం చేరుకొంటాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కార్తీక్ (ఆది) గొప్పింటి యువతిని పెళ్లి చేసుకోవాలని కలలు కని భంగపాటుకు గురవుతాడు. నగరంలోనే ఉమామహేశ్వర్‌రావు ఉరఫ్ మహేశ్ (రాజేంద్రప్రసాద్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. ఇదిలా ఉండగా జగన్నాథం వేలంలో ఐదుకోట్లు వెచ్చించి వింటేజ్ రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేస్తాడు. తన తల్లి, తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వడానికి రోల్స్ రాయిస్ కారును తీసుకొని నగరంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు వెళ్తాడు. వీరంతా ఆ హోటల్‌లోని పబ్‌లో మత్తులో మునిగి తేలుతారు. పార్టీ అనంతరం ఆ కారు చోరికి గురైంది పోలీస్ ఇన్స్‌పెక్టర్ రంజిత్ కుమార్ ( నారా రోహిత్)కు ఫిర్యాదు అందడంతో అసలు కథ ఊపందుకొంటుంది. రోల్స్ రాయిస్‌‌ను ఎవరు దొంగిలించారనే కోణంలో రంజిత్ కుమార్ దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఆ క్రమంలో ఆ పార్టీకి వచ్చిన శివ, కార్తీక్, సుధీర్ కుమార్, ఉమామహేశ్వర్ రావు అనుమానితులుగా మారుతారు. అయితే ఈ నలుగురికి కారు చోరికి సంబంధం ఉందా? వారిలో ఎవరు దొంగిలించారు? వారికి కారు చోరితో సంబంధం లేకపోతే కారు ఏమైపోయింది లాంటి ప్రశ్నలకు సమాధానమే శమంతకమణి చిత్ర కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+