X
తెలుగు » సినిమాలు » శమంతకమణి
శమంతకమణి

శమంతకమణి

Action | Romance | 14 Jul 2017 | U |
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

శమంతకమణి స్టోరీ

శమంతకమణి సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది, సుమన్, చాందిని చౌదరి, జెన్నీ హనీ, అనన్య సోని, నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది, సుమన్, చాందిని చౌదరి, జెన్నీ హనీ, అనన్య సోని, ఇంద్రజ, సస్తూరి, తనికెళ్ల భరణి, హేమ, సురేఖా వాణి, సత్యం రాజేష్, బెనర్జీ, అదుర్స్ రఘు  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీ రామ్ ఆదిత్య వహించారు మరియు భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ స్వరాలు అందించారు.  కథ హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త జగన్నాథం (సుమన్) కుమారుడు కృష్ణ ( సుధీర్ కుమార్). చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో తల్లిని పోగొట్టుకొన్న కృష్ణ ఆమె జ్ఙాపకాలతోనే జీవితాన్ని నెట్టుకొస్తుంటాడు. కోటిపల్లి అనే గ్రామంలో థియేటర్ నడిపే శివ ( సందీప్ కిషన్) ప్రియురాలి మోసానికి గురై పట్నం చేరుకొంటాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కార్తీక్ (ఆది) గొప్పింటి యువతిని పెళ్లి చేసుకోవాలని కలలు కని భంగపాటుకు గురవుతాడు. నగరంలోనే ఉమామహేశ్వర్‌రావు ఉరఫ్ మహేశ్ (రాజేంద్రప్రసాద్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. ఇదిలా ఉండగా జగన్నాథం వేలంలో ఐదుకోట్లు వెచ్చించి వింటేజ్ రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేస్తాడు. తన తల్లి, తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వడానికి రోల్స్ రాయిస్ కారును తీసుకొని నగరంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు వెళ్తాడు. వీరంతా ఆ హోటల్‌లోని పబ్‌లో మత్తులో మునిగి తేలుతారు. పార్టీ అనంతరం ఆ కారు చోరికి గురైంది పోలీస్ ఇన్స్‌పెక్టర్ రంజిత్ కుమార్ ( నారా రోహిత్)కు ఫిర్యాదు అందడంతో అసలు కథ ఊపందుకొంటుంది. రోల్స్ రాయిస్‌‌ను ఎవరు దొంగిలించారనే కోణంలో రంజిత్ కుమార్ దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఆ క్రమంలో ఆ పార్టీకి వచ్చిన శివ, కార్తీక్, సుధీర్ కుమార్, ఉమామహేశ్వర్ రావు అనుమానితులుగా మారుతారు. అయితే ఈ నలుగురికి కారు చోరికి సంబంధం ఉందా? వారిలో ఎవరు దొంగిలించారు? వారికి కారు చోరితో సంబంధం లేకపోతే కారు ఏమైపోయింది లాంటి ప్రశ్నలకు సమాధానమే శమంతకమణి చిత్ర కథ.
Read More

శమంతకమణి కాస్ట్ & క్రూ

శమంతకమణి సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీరామ్ అదిత్య
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత ఆనంద ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శమంతకమణి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మంతకమణి మల్టీస్టారర్ కథ కావడంతో పాత్రల పరిచయంతోనే ఫస్టాఫ్‌లో కొంత భాగం గడిచిపోతుంది. మిగితా సగభాగంలో పాత్రల ఎస్టాబ్లిష్‌మెంట్, ఆ పాత్రల కష్టసుఖాలతో కథ చకచకా సాగిపోతుంది. ఇంటర్వెల్ ముందు రాల్స్ రాయిస్ చోరి కావడం అనే ఇంట్రస్టింగ్ పాయింట్‌తో మొదటి భాగంలో ప్రేక్షకుడిని ఆసక్తి కలిగించడంలో దర్శకుడు శ్రీరాం ఆదిత్య తన ప్రతిభను తెరపైన ఆవిష్కరించుకొన్నాడు. ఈ సినిమాకు ముందు ఒకే సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీరాం నలుగురు హీరోలు, సీనియర్ ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ పాత్రల చిత్రీకరణలో బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం సినిమాకు ప్లస్ అయింది. సెకండాఫ్‌లో ఆసక్తిని కలిగించే పాయింట్ ఉండటంతో ఏమి జరిగిందనే అంశాన్ని తెలుసుకోవడానికి సిద్ధమైన ప్రేక్షకుడికి ఓ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. కథలో అనేక ట్విస్టులు, టర్నింగ్‌లు ప్రేక్షకులను థ్రిల్లింగ్ గురిచేస్తాయి. పాత్రల పరిధి మేరకు దర్శకుడు ఆయా నటుల నుంచి మంచి నటనను రాబట్టుకొన్నారు. నారా రోహిత్ ఇన్వెస్టిగేషన్‌ చేసే విధానాన్ని చక్కగా రాసుకొన్నారు. బలమైన సన్నివేశాల కారణంగా సినిమా ఎక్కడా డ్రాప్ కాకుండా నిలబడగలిగింది. క్లైమాక్స్‌లో ఊహించని విధంగా కథను మలుపు తిప్పి శమంతకమణిని యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ అనే ఫీలింగ్‌ను కల్పించాడు. శమంతకమణి చిత్రం రెగ్యులర్ ఫార్మాట్ చిత్రం కాదు. ఈ చిత్రం స్క్రీన్ ‌ప్లే ఆధారంగా సాగే చిత్రం. కొత్త దర్శకుల రూపొందించే సినిమాలు పాతతరం దర్శకుల మేకింగ్‌, సంప్రదాయ పద్దతలకు దూరంగా ఉంటాయి. అయితే సినిమాకు కావాల్సిన కమర్షియల్ హంగులు, కామెడి అంశాలు పుష్కలంగానే ఉన్నాయి. కానీ ఈ చిత్రం మల్టీప్లెక్స్ ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉంటే చిత్రం. ప్రస్తుతం బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల టేస్ట్‌ కూడా పరిస్థితులకు అనుగుణంగా మారుతుందనే అంశం ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు రుజువు చేశాయి. ఒకవేళ బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అయితే భవ్య క్రియేషన్స్ బ్యానర్‌, దర్శకుడు శ్రీరాం ఆదిత్య ఖాతాలో మరో విజయం చేరడం ఖాయం. ఈ సినిమా హిట్ అయితే నలుగురి హీరోలకు పెద్దగా పేరు వచ్చే పరిస్థితి కనిపించదనే మాటను బలంగా చెప్పవచ్చు.

శమంతకమణి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Hii I'm a telugu person.. I saw this movie today it's naturally realistic... Superb dhanush and sonia agarwal...

×
2.6 /5 Your Rating

శమంతకమణి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+