స్నేహితుడా సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, మాధవీ లత, నాజర్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, యం.యస్.నారాయణ, కిన్నెర, సౌమ్యా రాయ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సత్యం బెల్లంకొండ నిర్వహించారు మరియు నిర్మాతలు: జెమిని ఫిల్మ్ సర్య్కూట్స్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శివరామ్ శంకర్ స్వరాలు సమకుర్చారు.
కథ
స్నేహితుడా చిత్రం ఇద్దరి మధ్య వున్న స్నేహబంధం...ఆపై ఆ స్నేహం ఎలా ప్రేమగా మారిందన్న రొటీన్ కథాంశాన్నే తీసుకొనే తీసారు. ఇక కథ విషయానికి వస్తే సాయి(నాని) కి ఎవ్వరూ వుండరు. ఎలాంటి బాధ్యతలు లేకుండా బిందాస్ గా వుంటాడు. ఇలాంటి సాయి ఓ సారి సావిత్రి(మాధవీ లత )ని కలుస్తాడు. వీరిద్దరికీ క్షణం పడదు...ఎప్పుడూ గొడవ పడుతుంటారు. అలాంటిది సావిత్రి ఓ రోజు వాళ్ల నాన్నతో గొడవపడి ఇంట్లోంచి బయటకొచ్చేస్తుంది, సాయిని సాయం కోరుతుంది. సాయి తనకి సాయపడతాడు...దీంతో వారిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. ఇక మిగిలిన కథ సావిత్రి ఇంట్లో నుంచీ బయటకు రావడానికి దారితీసిన పరిస్థితులేంటి....ఎలా సాయి, సావిత్రిల స్నేహం ప్రేమగా మారిందనేది మిగతా కథ.