X
తెలుగు » సినిమాలు » స్నేహితుడా
స్నేహితుడా

స్నేహితుడా

Romance | 07 Aug 2009 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

స్నేహితుడా స్టోరీ

స్నేహితుడా సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, మాధవీ లత , నాజర్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, యం.యస్.నారాయణ, కిన్నెర, సౌమ్యా రాయ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సత్యం బెల్లంకొండ నిర్వహించారు మరియు నిర్మాతలు: జెమిని ఫిల్మ్ సర్య్కూట్స్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శివరామ్ శంకర్ స్వరాలు సమకుర్చారు. కథ స్నేహితుడా చిత్రం ఇద్దరి మధ్య వున్న స్నేహబంధం...ఆపై ఆ స్నేహం ఎలా ప్రేమగా మారిందన్న రొటీన్ కథాంశాన్నే తీసుకొనే తీసారు. ఇక కథ విషయానికి వస్తే సాయి(నాని) కి ఎవ్వరూ వుండరు. ఎలాంటి బాధ్యతలు లేకుండా బిందాస్ గా వుంటాడు. ఇలాంటి సాయి ఓ సారి సావిత్రి(మాధవీ లత )ని కలుస్తాడు. వీరిద్దరికీ క్షణం పడదు...ఎప్పుడూ గొడవ పడుతుంటారు. అలాంటిది సావిత్రి ఓ రోజు వాళ్ల నాన్నతో గొడవపడి ఇంట్లోంచి బయటకొచ్చేస్తుంది, సాయిని సాయం కోరుతుంది. సాయి తనకి సాయపడతాడు...దీంతో వారిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. ఇక మిగిలిన కథ సావిత్రి ఇంట్లో నుంచీ బయటకు రావడానికి దారితీసిన పరిస్థితులేంటి....ఎలా సాయి, సావిత్రిల స్నేహం ప్రేమగా మారిందనేది మిగతా కథ.
Read More

స్నేహితుడా కాస్ట్ & క్రూ

స్నేహితుడా సిబ్బంది సమాచారం

దర్శకత్వం సత్యం బెల్లంకొండ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శివశంకర్
నిర్మాత జెమిని ఫిల్మ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

స్నేహితుడా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇక నాని ఈ చిత్రం మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. చక్కటి నటనను ప్రదర్శించాడు. ఇతర ప్రాంతాల నుండీ హీరోయిన్లు దిగుమతి అవుతున్న ఈ రోజుల్లో మన తెలుగు అమ్మాయి మాధవీ లత తన నటనతో వారందరి కంటే ఎంతో నయం అనిపించుకొంది. నచ్చావులే చిత్రం ద్వారా పరిచయమైన మాధవి నటనకు అవకాశం వున్న పాత్రలో చక్కగా నటించింది. నాజర్, తనికెళ్ల భరణి తమ పాత్రలకు న్యాయం చేసారు. బ్రహ్మానందం, యం.యస్.నారాయణ ల కామెడీ ఫర్వాలేదనిపించుకుంది. ఇక మిగితా పాత్రధారులు తమ పరిధిమేర బాగానే నటించారు.

స్నేహితుడా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

స్నేహితుడా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+