స్నేహితుడు తమిళ అనువాద సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, జీవా, శ్రీరామ్, ఇలియానా, సత్యరాజ్ తదితరురు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ నిర్వహించారు మరియు నిర్మాతలు రాజు ఈశ్వరన్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హేరేశ్ జయరాజ్ స్వరాలు సమకుర్చారు
కథ
తెలిసిన కథనే మళ్లీ చెప్పుకుంటే వెంకట్(శ్రీరామ్), నిఖిల్(జీవా)ఇద్దరూ కలిసి తమ కాలేజీ మేట్, క్లోజ్ ప్రెండ్ అయిన పంచబట్ల సారంగ పాణి(విజయ్)కోసం వెతుకుతూ తమ గతాన్ని గుర్తు చేసుకుంటూంటారు. ఆ గతం వారు స్ట్రిక్ట్ ప్రిన్స్ పాల్ విరూపాక్ష సుందరం(సత్యరాజ్)నడిపే ఐడిల్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరటం తో మొదలవుతుంది. అక్కడే వారికి పాణి పరిచయమవుతాడు. కొద్దిపాటి పరిచయంలోనే వారు ప్రాణ స్నేహితులు అవుతారు. పాణికి ఆక్కడ స్టూడెంట్స్ ఎదుర్కొనే ఒత్తిడి, విద్యా విధానం నచ్చుదు దాంతో మాటిమాటికీ తమ ప్రిన్స్ పాల్ తో విభేదిస్తూంటాడు. మరోప్రక్క తాము వైరస్ అని ముద్దుగా పిలుచుకునే ప్రిన్స్ పాల్ కూతురు(ఇలియానా)తో పాణి ప్రేమలో పడతాడు...అప్పుడు ఏం జరిగింది...తమ ప్రిన్స్ పాల్ లో మార్పు ఎలా తెచ్చాడు. చివరకు పాణి ఏమయ్యాడు అనేది మిగతా కథ.