విలేజిలో వినాయకుడు కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కృష్ణుడు, శరణ్య మోహన్, యండమూరి వీరేంద్రనాథ్, రావు రమేష్, జోగినాయుడు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాయికిరణ్ అడవి నిర్వహించారు మరియు నిర్మాత మహీ నిర్వహించారు. ఈ చిత్రనికి సంగీతదర్శకుడు మణికంఠ కాద్రి స్వరాలు సమకుర్చారు.
కథ
కథ..ట్యాగ్ లైన్ లో చెప్పినట్లు..కార్తీక్ (కృష్ణుడు)ని ప్రేమించిన కావ్య(శరణ్యా మోహన్)అతని గురించి ఆమె ఇంట్లో గొప్పగా బిల్డప్ ఇస్తుంది..అసలు లావు విషయం దాచి పెట్టి. అయితే ఈ విషయం రివిల్ చేసి ఒప్పించే లోపలే కార్తీక్ ఉండబట్టలేక ఆ ఊళ్లో దిగుతాడు. ఇక పల్లెలో ఉండే కావ్య తండ్రి కర్నల్ లక్ష్మీపతి(రావు రమేష్)కి అల్లుడు సెలక్షన్ విషయమై కొన్ని నిర్ధుష్ట అభిప్రాయాలు ఉంటాయి. అవి కార్తీక్ ని చూడగానే డైలమాలోకి వెళ్ళిపోతాయి. అయితే డైరక్టుగా కార్తీక్ ని రిజెక్టు చేస్తే కూతురు నొచ్చుకుంటుందని అతనితో పరోక్ష యుద్దానికి దిగుతాడు. అలా మీట్స్ ద పేరెంట్స్ స్కీమ్ లోకి వెళ్ళిన కార్తీక్ తన మంచితనం అమాయికత్వంతో ఆయన మనస్సు గెలుచుకుని,ఆ ఇంటి వారందరి మన్ననలు ఎలా పొందుతాడనేది మిగతా కథ. అలాగే ఈ కథలో ఫుల్ లెంగ్త్ పాత్రలోకి ప్రముఖ నవలా రచయిత యండమూరి ఎలా వచ్చి నవ్వించే ప్రయత్నం చేసాడన్నది తెరపై చూడాల్సిందే.