twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vivaha Bhojanambu review: సింపుల్ అండ్ సూపర్ అనిపించిన సత్య, సందీప్ కిషన్

    |

    2.75/5

    కరోనా కారణంగా థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ కాని పరిస్థితుల్లో సోని లివ్ ఓటీటీలో విడుదలైన చిత్రం వివాహ భోజనంబు. ఇప్పటి వరకు కమెడియన్‌గా సుపరిచితులైన సత్య హీరోగా సందీప్ కిషన్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. ప్రచార చిత్రాలు, వీడియోలు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. కథ, కథనాలను, ఆర్టిస్టు ఫెర్ఫార్మెన్స్ గురించి చర్చించుకోవాల్సిందే.

    వివాహ భోజనంబు కథ ఇలా..

    వివాహ భోజనంబు కథ ఇలా..

    ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసే పత్తి గింజల మహేష్ (సత్య) పక్కా పిసినారి, ఓ అనాథ. అలాంటి వ్యక్తి సంపన్న కుటుంబానికి చెందిన అనితతో (ఆర్జావీ)తో ప్రేమలో పడుతాడు. తన కూతురు అతి సాధారణమైన వ్యక్తితో ఎలా ప్రేమలో పడిందనే విషయంతో తండ్రి రామకృష్ణ (శ్రీకాంత్ అయ్యంగార్) షాక్ తింటాడు. కానీ కూతురిపై ప్రేమను చంపుకోలేక మహేష్‌తో పెళ్లి చేస్తారు. అయితే అనాథ అనే విషయాన్ని దాచి పెట్టడంతో మహేష్‌పై రామకృష్ణ కోపం పెంచుకొంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో పైసా పోతే ప్రాణం పోతుందనుకొనే మహేష్ ఇంటికి తన భార్య కుటుంబ సభ్యులంతా వస్తారు. ఆ సమయంలోనే కరోనా వల్ల లాక్‌డౌన్ విధించడంతో కుటుంబ సభ్యుల మహేష్ ఇంటిలో ఉండిపోతారు.

    సినిమాలో ట్విస్టులు ఇలా..

    సినిమాలో ట్విస్టులు ఇలా..

    లాక్‌డౌన్‌లో తన భార్య అనిత కుటుంబంలోని పది మంది తన ఇంట్లో ఉంటే పిసినారి మహేష్ ఏం చేశాడు? మహేష్ ఎందుకు పిసినారిగా మారాడు? రాజారాం (సుబ్బరాయ శర్మ) అనే సంపన్నుడి మనవరాలు అనిత అందగాడు కానీ మహేష్‌ను ఎందుకు ప్రేమించింది? లాక్‌డౌన్‌లో మహేష్ పిసినారి తనం అనిత కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించింది? అనిత తాత రాజారాం ఆరోగ్యం క్షీణిస్తే మహేష్ తాను దాచుకొన్న డబ్బంతా ఎందుకు కట్టాడు? ఉన్నత కుటుంబాలకు చెందిన రాజారాం, రామకృష్ణ చివరకు మహేష్‌ను ఎలాంటి పరిస్థితుల్లో తమ ఇంటి అల్లుడిగా అంగీకరించారు. ఈ కథలో అంబులెన్స్ డ్రైవర్ నెల్లూరు ప్రభ (సందీప్ కిషన్) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే వివాహ భోజనంబు సినిమా కథ.

    తొలి భాగం ఎలా ఉందంటే..

    తొలి భాగం ఎలా ఉందంటే..

    మహేష్, అనిత పెళ్లి వ్యవహారంతో కథ చాలా స్లోగా, సాదాసీదాగా మొదలవుతుంది. పెళ్లి తర్వాత శోభనానికి ముందు లాక్‌డౌన్ విధించడంతో అనిత కుటుంబ సభ్యులు మహేష్ ఇంట్లో తిష్ట చేయడం ఎపిసోడ్‌ అప్పుడు వినోదాన్ని పంచుతూ ముందుకు వెళ్తుంది. ఎప్పడైతే మహేష్‌, అనిత ఎలా ప్రేమలో పడ్డారనే విషయం చెప్పమని రామకృష్ణ కుటుంబం అడగ్గానే... కథ వేగం అందుకొంటుంది. ఆ తర్వాత ఫన్నీగా, జోష్‌గా, ఎమోషనల్‌గా సాగుతుంది. తొలిభాగం ఫీల్‌గుడ్ పాయింట్స్ ఆకట్టుకొనే ప్రయత్నం జరుగుతుంది.

    రెండవ భాగం ఎమోషనల్‌గా

    రెండవ భాగం ఎమోషనల్‌గా

    ఇక సెకండాఫ్‌లో అనాథగా మహేష్ జీవితం గురించి, తాను ఎందుకు పిసినారిగా మారారనే విషయం వెల్లడైన తర్వాత కథ మరింత ఎమోషనల్‌గా మారుతుంది. ఆ తర్వాత అనిత తాతకి గుండె జబ్బు రావడం, వారి ఆర్థిక పరిస్థితి తలకిందులైన సమయంలో మహేష్ ముందుకొచ్చి ఆదుకోవడం సినిమాటిక్‌గా కనిపిస్తాయి. అప్పటి వరకు నేచురల్ వేలో సాగిన కథ కాస్త రొటీన్‌గా మారిపోతుంది. చివర్లో సందీప్ కిషన్‌కు సంబంధించిన చిన్న ట్విస్టుతో స్టోరీ హ్యాపీ ఎండింగ్‌తో ముగుస్తుంది.

     దర్శకుడు రామ్ అబ్బరాజు టేకింగ్ గురించి

    దర్శకుడు రామ్ అబ్బరాజు టేకింగ్ గురించి

    దర్శకుడు రామ్ అబ్బరాజు ఎంచుకొన్న పాయింట్ చాలా బాగుంది. మరింత వినోదం పండించే సన్నివేశాలను రాసుకొని ఉంటే డెఫినెట్‌గా ఊహించని హిట్ అయి ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఆర్టిస్టుల మధ్య సన్నివేశాల కంటే ప్రధాని మోదీ లాక్‌డౌన్ గురించి చెప్పే సీన్లు మరింత కామెడీగా మారాయి. కమర్షియల్ హంగులకు పోకుండా సత్యను నమ్ముకొని కథను నడిపించడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. నటీనటులు, పాత్రలను డీల్ చేసిన విధానం బాగుందని చెప్పవచ్చు. తొలి చిత్ర దర్శకుడిగా ఫస్ట్ క్లాస్‌లోనే పాస్ అయ్యాడని చెప్పవచ్చు.

    సత్య హీరోగా ఎలా చేశాడంటే..

    సత్య హీరోగా ఎలా చేశాడంటే..

    వివాహ భోజనంబు సినిమాను పూర్తిగా సత్య తన భుజాలపైనే మోశాడు. తన కామెడీ టైమింగ్‌తోను, భావోద్వేగమైన నటనతో ఆకట్టుకొన్నాడు. తన కామెడీ స్పీడ్‌కు తగినట్టుగా బలమైన సన్నివేశాలు లేకపోవడం, తన పంచ్ పవర్‌కు తగిన డైలాగ్స్ వినిపించకపోవడం కాస్త నిరాశనే అనిపిస్తుంది. ఓవరాల్‌గా సత్య తనదైన నటనతో ఆకట్టుకొన్నాడనే విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని చెప్పవచ్చు. ఇక హీరోయిన్‌గా ఆర్జావీ గ్లామర్‌గా కనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో తన ప్రతిభను చాటుకొనలేకపోయింది.

    సందీప్ కిషన్, మిగితా క్యారెక్టర్లు ఇలా...

    సందీప్ కిషన్, మిగితా క్యారెక్టర్లు ఇలా...

    మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. సందీప్ కిషన్‌ను అతిథి పాత్ర అయినప్పటికీ గుర్తుండి పోతారు. నెల్లూరు భాషలో మా నాయిన ఏం చెప్పాడంటే అంటూ.. కస్టమర్ ఈజ్ డాగ్ అంటూ వచ్చి రానీ ఇంగ్లీష్ భాష మాట్లాడే అంబులెన్స్ డ్రైవర్‌గా అదరగట్టేశాడు. సినిమా యావరేజ్‌గా సాగుతున్న సమయంలో ఒక్క పుష్ ఇచ్చి పరిగెత్తేలా చేశాడని చెప్పవచ్చు. సత్య తర్వాత మంచి పెర్ఫార్మెన్స్ పలికించింది శ్రీకాంత్ అయ్యంగార్. తన కూతురికి 20 వేలు ఇవ్వకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందనే సీన్‌ను శ్రీకాంత్ బాగా పండించాడు. అలాగే ఉప్మా సంబంధిత సీన్లు, అలాగే హాస్పిటల్ సీన్లలో ఆకట్టుకొంటాడు. ఇక స్వర్గీయ టీఎన్నాఆర్‌కు మంచి పాత్ర లభించింది. కామెడీకి క్యూ ఇచ్చే విధంగా లభించిన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. తన కెరీర్‌లో టీఎన్నాఆర్ బెస్ట్ రోల్ లభించిందని చెప్పవచ్చు. సుదర్శన్, దయానంద్ రెడ్డి తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

     సాంకేతిక విభాగాల పనితీరు..

    సాంకేతిక విభాగాల పనితీరు..

    వివాహ భోజనంబు సినిమాకు ఎస్ మణికందన్ అందించిన సినిమాటోగ్రఫి హైలెట్. ఆ తర్వాత అనివీ అందించిన మ్యూజిక్, రీరికార్డింగ్ బాగుంది. ఏబీసీడి పాట చాలా క్యాచీగా ఉంది. నిడివి తక్కువగా ఉండటం ఎడిటర్ పనితీరు కారణమనిపిస్తుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సోల్చర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ బ్యానర్లపై కేఎస్ సినీష్, సందీప్ కిషన్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    వివాహ భోజనంబు సినిమా వినోదం, ఎమోషన్స్, నటీనటులు ఫెర్ఫార్మెన్స్ మేలవించిన చిత్రంగా చెప్పుకొవచ్చు. పాత్రలకు తగినట్టుగా పేరున్న నటీనటులను ఎంచుకొని ఉంటే ఈ సినిమా రేంజ్ మరో విధంగా ఉండేదనిపిస్తుంది. సినిమాను సత్య, శ్రీకాంత్ అయ్యంగార్‌తోపాటు సందీప్ కిషన్ ఫెర్ఫార్మెన్స్ నిలబెట్టింది. కథ, సన్నివేశాల పరంగా ఇంకొంత జాగ్రత్త పడి ఉంటే తప్పకుండా సూపర్ హిట్ చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకొనేది. కలెక్షన్ల గొడవ లేదు కనుక.. ఈ చిత్రాన్ని ఓటీటీలో కుటుంబ సభ్యులంతా కలిసి ఎంజాయ్ చేసే క్లీన్ అండ్ గ్రీన్ చిత్రం. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు ఓ ఆక్సిజన్ అందించే సింపుల్ అండ్ సూపర్ చిత్రం అని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తే మంచి అనుభూతి తప్పకుండా కలుగుతుంది.

    Recommended Video

    Prabhas పై పెరుగుతున్న అక్కసు.. అప్పుడు రజినీ ఇప్పుడు డార్లింగ్ | Pan India || Filmibeat Telugu
    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: సందీప్ కిషన్, సత్య, ఆర్జావీ, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టీఎన్నాఆర్, దయానంద్ రెడ్డి, వైవా హర్ష తదితరులు
    దర్శకత్వం: రామ్ అబ్బరాజు
    కథ: భాను భోగవరపు
    నిర్మాత: కేఎస్ సినీష్, సందీప్ కిషన్
    సినిమాటోగ్రఫి: ఎస్ మణికందన్
    ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
    మ్యూజిక్: అనివీ
    బ్యానర్స్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సోల్చర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
    ఓటీటీ రిలీజ్: సోని లివ్ యాప్
    ఓటీటీ రిలీజ్ డేట్: 2021-08-27

    English summary
    Vivaha Bhojanambu is a comedy movie directed by Ram Abbaraju. Satya, Sundeep Kishan and Aarjavee are in lead. Produced by K.S Sinish and Sundeep Kishan. This movie hits on Sony Liv OTT on Augugst 27th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X