Telugu » Movies » Yuddham Sharanam » Story

యుద్ధం శరణం (U/A)

సినిమా శైలి

Action

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

08 Sep 2017
కథ
యుద్ధం శరణం (ప్రతి అడుగు ఒక యుద్ధం, ప్రతి శ్వాస ఒక గెలుపు) సినిమా యాక్షన్, రోమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, లావణ్య త్రిపాటి, శ్రీకాంత్, రెవతి మీనన్, మురళి శర్మ, రావు రమేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణ ఆర్ వి మరిమత్తు వహించారు. మరియు వారాహి చలనచిత్రం బేనర్లో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్ అందించారు

కథ

అర్జున్ (నాగ చైతన్య) హ్యాపీ గోయింగ్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. తల్లిదండ్రులు రావు రమేష్, రేవతి ఒక స్వచ్ఛంద సంస్థ రన్ చేస్తూ పేదలకు వైద్యం అందిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు, ఇద్దరు అక్కలు, బావ... తాను ప్రేమించిన ప్రియురాలు (లావణ్య త్రిపాఠి)...... ఇలా ఎంతో సంతోషంగా సాగుతున్న అర్జున్ కుటుంబం హైదరాబాద్‌లోనే పెద్ద రౌడీ నాయక్ (శ్రీకాంత్) మూలంగా ప్రమాదం పడుతుంది. నాయక్ వల్ల అర్జున్ తనతల్లిదండ్రులను కోల్పోతాడు. మిగతా ఫ్యామిలీని కూడా చంపేందుకు నాయక్ ప్రయత్నిస్తున్నాడనే విషయం తెలుసుకుని వారిని కాపాడుకునేందుకు యుద్ధం మొదలు పెడతాడు. మరోవైపు హైదరాబాద్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగి చాలా మంది చనిపోతారు. కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎన్ఐఏ ఆఫీసర్(మురళి శర్మ) అర్జున్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ బాంబు పేలుళ్లకు, అర్జున్‍‌కు సంబంధం ఏమిటి? నాయక్‌ నుండి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.