X
తెలుగు » సినిమాలు » యుద్ధం శరణం
యుద్ధం శరణం

యుద్ధం శరణం

Action | Romance | 08 Sep 2017 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

యుద్ధం శరణం స్టోరీ

యుద్ధం శరణం (ప్రతి అడుగు ఒక యుద్ధం, ప్రతి శ్వాస ఒక గెలుపు) సినిమా యాక్షన్, రోమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, లావణ్య త్రిపాటి, శ్రీకాంత్, రెవతి మీనన్, మురళి శర్మ, రావు రమేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణ ఆర్ వి మరిమత్తు  వహించారు. మరియు వారాహి చలనచిత్రం బేనర్లో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్ అందించారు .  కథ అర్జున్ (నాగ చైతన్య) హ్యాపీ గోయింగ్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. తల్లిదండ్రులు రావు రమేష్, రేవతి ఒక స్వచ్ఛంద సంస్థ రన్ చేస్తూ పేదలకు వైద్యం అందిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు, ఇద్దరు అక్కలు, బావ... తాను ప్రేమించిన ప్రియురాలు (లావణ్య త్రిపాఠి)...... ఇలా ఎంతో సంతోషంగా సాగుతున్న అర్జున్ కుటుంబం హైదరాబాద్‌లోనే పెద్ద రౌడీ నాయక్ (శ్రీకాంత్) మూలంగా ప్రమాదం పడుతుంది. నాయక్ వల్ల అర్జున్ తనతల్లిదండ్రులను కోల్పోతాడు. మిగతా ఫ్యామిలీని కూడా చంపేందుకు నాయక్ ప్రయత్నిస్తున్నాడనే విషయం తెలుసుకుని వారిని కాపాడుకునేందుకు యుద్ధం మొదలు పెడతాడు. మరోవైపు హైదరాబాద్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగి చాలా మంది చనిపోతారు. కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎన్ఐఏ ఆఫీసర్(మురళి శర్మ) అర్జున్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ బాంబు పేలుళ్లకు, అర్జున్‍‌కు సంబంధం ఏమిటి? నాయక్‌ నుండి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.  
Read More

యుద్ధం శరణం కాస్ట్ & క్రూ

యుద్ధం శరణం సిబ్బంది సమాచారం

దర్శకత్వం కృష్ణ మరిమత్తు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం వివేక్ సాగర్
నిర్మాత రజని కొర్రపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

యుద్ధం శరణం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పెర్ఫార్మెన్స్ పరంగా నాగ చైతన్య... అర్జున్ పాత్రలో బాగా సూటయ్యాడు. తన ఫ్యామిలీని కాపాడుకునే క్రమంలో అతడు చేసిన పనులు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. నాగ చైతన్య, లావణ్య మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే సినిమా కథ ప్రకారం వీరి రొమాన్స్ పార్ట్ పరిమితం చేయాల్సి వచ్చింది. లావణ్య కనిపించేది కొన్ని సీన్లే అయినా ఉన్నంతలో ఇంప్రెస్ చేసింది. అర్జున్ తండ్రి పాత్రలో రావు రమేష్ మరోసారి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తల్లి పాత్రలో నటి రేవితి సూపర్భ్. అర్జున్, రావు రమేష్, రేవతి మధ్య మచ్చే కొన్ని సీన్లు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తాయి. విలన్ నాయక్ పాత్రలో శ్రీకాంత్ మెప్పించాడు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్‌కు వరుస విలన్ ఆఫర్లు రావడం ఖాయం. కమెడియన్ ప్రియదర్శి కనిపించిన రెండు మూడు సీన్లలో తనదైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు. నికేత్ బొమ్మి సినిమాటోట్రఫీ బావుంది. వివేక్ సాగర్ అందించిన సంగీతం ఫర్వాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ ఒకే. డేవిడ్ ఆర్.నాథన్, అబ్బూరి రవి అందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమా కథలో కొత్తదనం లేదు. రోటీన్ రివేంజ్ డ్రామా. అయితే స్క్రీన్లే కాస్త ఫర్వాలేదు. రోటీన్ గా సాగే కథకు స్లో నేరేషన్ పెద్ద మైనస్‌గా మారింది. ఎలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు లేకుండా సినిమా మరీ ఇంత స్లోగా ఉంటే ప్రేక్షకులు భరించడం కష్టమే. సినిమాలో ఓ సీన్లో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న గర్బవతి ప్రాణాలు కాపాడేందుకు డ్రోన్ ద్వారా రక్తం పంపించి ఆమెను కాపాడే సీన్ సినిమాలో బాగా హైలెట్ అయింది. ఆ సీన్ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతుంది.

యుద్ధం శరణం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

యుద్ధం శరణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+