bredcrumb

చీర కట్టులో మాయ చేసిన కాంతార బ్యూటీ .. రుక్మిణి వసంత్ గ్లామర్ ట్రీట్ అదుర్స్

By Rajesh Karampoori
| Published: Monday, October 27, 2025, 20:53 [IST]

Rukmini Vasanth: కాంతారా బ్యూటీ రుక్మిణి వసంత్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. స్టైలీష్ లుక్‌లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

Rukmini Vasanth
1/6

ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సునామీలా దూసుకెళ్తున్న హీరోయిన్ రుక్మిణి వసంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ కాలంలోనే ఈ బెంగళూరు బ్యూటీ తన అందం, అభినయం, గ్లామర్‌ మిక్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

Rukmini Vasanth
2/6

రక్షిత్ శెట్టి సరసన నటించిన “సప్తసాగరాలు దాటి” సినిమాలో నటించి ఒక్కసారిగా స్టార్ రేంజ్‌లోకి ఎక్కిపోయింది. ఆ సినిమా తర్వాత రుక్మిణి పేరు అన్ని భాషల్లో మారుమోగింది. కన్నడలో స్టార్ హీరోయిన్‌గా, ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంటోంది.

Rukmini Vasanth
3/6

కన్నడలో విజయం తర్వాత రుక్మిణి తెలుగు తెరకు “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” సినిమాతో పరిచయమైంది. సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, రుక్మిణి పెర్ఫార్మెన్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది.

Rukmini Vasanth
4/6

ఆ తరువాత  రుక్మిణి తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మదరాసీ” సినిమాలో ఆమె నటించింది. ఈ సినిమా కూడా అనుకున్నంత సక్సెస్ కాకున్నా.. తన నటనతో తమిళ ఆడియన్స్ మనసులు గెలుచుకుంటుంది

Rukmini Vasanth
5/6

తాజాగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న “కాంతారా చాప్టర్ 1” సినిమాలో రుక్మిణి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ మారింది. ఇందులో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఈ సినిమాతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

Rukmini Vasanth
6/6

కాంతార సక్సెస్ తరువాత టాలీవుడ్‌ స్టార్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ “డ్రాగన్”లోనూ రుక్మిణినే హీరోయిన్‌గా తీసుకున్నారు. అదీ కాక యశ్, గీతూ మోహన్ దాస్ కాంబోలో రూపొందనున్న మరో పాన్ ఇండియా సినిమాలోనూ ఈ బ్యూటీ ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది. వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ రుక్మిణి ఇప్పుడు దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా నిలిచింది.

X