By
Siva Kodati
| Published: Saturday, May 30, 2026, 21:01 [IST]
ఘట్టమనేని జయకృష్ణ హీరోగా లాంచ్ అవుతున్న శ్రీనివాస మంగాపరం పాత్రల పరిచయ కార్యక్రమంలో రషా తడానీ ఫోటోలు
1/5
శ్రీనివాస మంగాపురంలో మంగగా రషా తడానీ.. స్టన్నింగ్ లుక్‌లో శ్రీనుగాడి గర్ల్‌ఫ్రెండ్! | Rasha Thadani Stunning At Ghattamaneni Jayakrishna's Srinivasa Mangapuram Movie Artists Introduction Event - Filmibeat Telugu
/photos/feature/rasha-thadani-stunning-at-ghattamaneni-jayakrishnas-srinivasa-mangapuram-movie-artists-introduction-event-fb107844.html
సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు కృష్ణ పెద్దకుమారుడు రమేశ్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ అగ్రనటి రవీనా టాండన్ కుమార్ రషా తడానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని నటీనటుల పరిచయ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. జయకృష్ణ శ్రీనుగా.. రషా తడానీ మంగ అనే పాత్రల్లో నటిస్తారని చిత్ర యూనిట్ ప్రకటించింది.
2/5
శ్రీనివాస మంగాపురంలో మంగగా రషా తడానీ.. స్టన్నింగ్ లుక్‌లో శ్రీనుగాడి గర్ల్‌ఫ్రెండ్! | Rasha Thadani Stunning At Ghattamaneni Jayakrishna's Srinivasa Mangapuram Movie Artists Introduction Event - Filmibeat Telugu
/photos/feature/rasha-thadani-stunning-at-ghattamaneni-jayakrishnas-srinivasa-mangapuram-movie-artists-introduction-event-fb107844.html#photos-1
ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. వైజయంతీ మూవీస్‌లో కృష్ణగారితో నేను తీసిన అగ్నిపర్వతం పెద్ద సెన్షేషనల్ హిట్. ఆ తర్వాత మహేశ్ బాబుతో వైజయంతీ బ్యానర్‌లోనే తీసిన రాజకుమారుడు సెన్షేషనల్ హిట్. మళ్లీ సేమ్ వైజయంతీ మూవీస్‌లోనే ఘట్టమనేని జయకృష్ణ, నా ఫేవరెట్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీలను వైజయంతీ బ్యానర్ ద్వారా పరిచయం చేస్తున్నామని చెప్పారు. యంగ్ టాలెంట్‌ను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తుంటానని రాఘవేంద్రరావు అన్నారు.
3/5
శ్రీనివాస మంగాపురంలో మంగగా రషా తడానీ.. స్టన్నింగ్ లుక్‌లో శ్రీనుగాడి గర్ల్‌ఫ్రెండ్! | Rasha Thadani Stunning At Ghattamaneni Jayakrishna's Srinivasa Mangapuram Movie Artists Introduction Event - Filmibeat Telugu
/photos/feature/rasha-thadani-stunning-at-ghattamaneni-jayakrishnas-srinivasa-mangapuram-movie-artists-introduction-event-fb107844.html#photos-2
హీరోయిన్ రషా తడానీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద ఫ్యాన్‌ని. ఈ ఇండస్ట్రీలో పనిచేయడం గర్వంగా ఉంది. నా మీద మీ ప్రేమ, అభిమానం ఉంటుందని రషా తడానీ చెప్పింది. తెలుగును నేర్చుకుంటున్నా.. త్వరలోనే పూర్తిగా మాట్లాడుతున్నాను. జయకృష్ణ చాలా ఫన్నీ. నేను ఒక సినిమా చేసినా, ఆయన కంటే సీనియర్ అయినా ఇద్దరం సాయం చేసుకుంటూ వర్క్ చేశామని చెప్పింది.
4/5
శ్రీనివాస మంగాపురంలో మంగగా రషా తడానీ.. స్టన్నింగ్ లుక్‌లో శ్రీనుగాడి గర్ల్‌ఫ్రెండ్! | Rasha Thadani Stunning At Ghattamaneni Jayakrishna's Srinivasa Mangapuram Movie Artists Introduction Event - Filmibeat Telugu
/photos/feature/rasha-thadani-stunning-at-ghattamaneni-jayakrishnas-srinivasa-mangapuram-movie-artists-introduction-event-fb107844.html#photos-3
హీరో జయకృష్ణ మాట్లాడుతూ.. మా తాత నాకు దేవుడు. ఆయన ఆరోజు ఉండి ఉంటే బాగుండేది. ఆయన ఎక్కడున్న తాతయ్య ఆశీస్సులు నా మీద ఉంటాయని భావిస్తున్నా. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాను. తొలి సినిమాకు అజయ్ భూపతి లాంటి డైరెక్టర్‌తో వర్క్ చేయడం నా అదృష్టం. దత్తు గారు తాతయ్యతో అగ్నిపర్వతం, బాబాయ్‌తో రాజకుమారుడు తీశారు. ఇప్పుడు నన్ను లాంచ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని అన్ని పాటలు బాగుంటాయి. రషా తడానీ బ్రిలియంట్ యాక్టర్. నా ఫస్ట్ సినిమాలో ఆమె ఎంతో సాయం చేశారని జయకృష్ణ అన్నారు.
5/5
శ్రీనివాస మంగాపురంలో మంగగా రషా తడానీ.. స్టన్నింగ్ లుక్‌లో శ్రీనుగాడి గర్ల్‌ఫ్రెండ్! | Rasha Thadani Stunning At Ghattamaneni Jayakrishna's Srinivasa Mangapuram Movie Artists Introduction Event - Filmibeat Telugu
/photos/feature/rasha-thadani-stunning-at-ghattamaneni-jayakrishnas-srinivasa-mangapuram-movie-artists-introduction-event-fb107844.html#photos-4
నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. శ్రీనివాస మంగాపురం మూవీ జూలై 9 ప్రేక్షకుల ముందుకొస్తుంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 52 ఏళ్లు అవుతుంది. రాఘవేంద్రరావు గారు లేకపోతే అశ్వినీదత్ అనేవాడు ఉండడు. 1975లో ఎన్టీఆర్‌తో మొట్టమొదటి సినిమా, 77లో రెండో సినిమా చేశా. ఆయన తర్వాత కృష్ణగారితో చేశాను. నేను లాంచ్ చేసిన మహేశ్, అల్లు అర్జున్‌లకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అశ్వినీదత్.