bredcrumb

చిరంజీవి నుంచి నాగార్జున వరకు… బెల్లంకొండ వెడ్డింగ్ సాయి శ్రీనివాస్ రిసెప్షన్‌లో స్టార్ల సందడి

By Rajesh Karampoori
| Published: Saturday, May 2, 2026, 06:24 [IST]

Bellamkonda Sai Sreenivas Wedding Reception: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ ప్రత్యేక ఫోటో గ్యాలరీలో పెళ్లి రిసెప్షన్‌కు సంబంధించిన అందమైన క్షణాలు, వైరల్ ఫోటోలు, క్యూట్ కపుల్ లుక్స్‌ను చూడండి.

Bellamkonda Sai Sreenivas Wedding Reception
1/8

Bellamkonda Sreenivas Wedding Reception: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి కావ్య రెడ్డితో వివాహ బంధంలో అడుగుపెట్టాడు ఈ హీరో. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్నారు. ఈ శుభవార్తతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

Bellamkonda Sai Sreenivas Wedding Reception
2/8

వీరి వివాహా వేడుక ఏప్రిల్ 29న తిరుమల వేంకటేశ్వర ఆలయ సన్నిధిలో ఈ వివాహం అట్టహాసంగా జరిగింది. వేదమంత్రాల మధ్య, సాంప్రదాయ వంటల్లో సాయి శ్రీనివాస్ మూడు ముళ్లు వేసి కావ్యను తన జీవిత భాగస్వామిగా స్వీకరించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

Bellamkonda Sai Sreenivas Wedding Reception
3/8

పెళ్లి అనంతరం మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుక సినీ, రాజకీయ ప్రముఖులతో కళకళలాడింది. పెద్ద టాలీవుడ్ హాజరవడంతో ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా జరిగింది.

Bellamkonda Sai Sreenivas Wedding Reception
4/8

రిసెప్షన్‌కు చిరంజీవి, అక్కినేని నాగార్జున, మోహన్ బాబు, నాగ చైతన్య, కాజల్ అగర్వాల్, గోపీచంద్, శ్రీకాంత్, తరుణ్ వంటి ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే అలీ, నిర్మాత దిల్ రాజు, రాజకీయ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు.

Bellamkonda Sai Sreenivas Wedding Reception
5/8

ఈ వేడుకలో ఒక ప్రత్యేకమైన సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది. చిరంజీవి మరియు మోహన్ బాబు సినీ దిగ్గజాలకు బెల్లంకొండ కుటుంబం పాదాభివందనం చేయడం గౌరవాన్ని చాటింది. ఈ క్షణాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Bellamkonda Sai Sreenivas Wedding Reception
6/8

ఇక సాయి శ్రీనివాస్ తన పెళ్లి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన భార్యను అభిమానులకు పరిచయం చేశారు. ఆమెను “పవర్‌ఫుల్” అని చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ జంట క్యూట్ లుక్స్, అన్యోన్యత చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Bellamkonda Sai Sreenivas Wedding Reception
7/8

వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. కొత్త జంట స్టైలిష్ లుక్స్, సెలబ్రిటీల సందడి ఈ వేడుకను మరింత గ్రాండ్‌గా మార్చాయి. ముఖ్యంగా సినీ ప్రముఖుల రాకతో ఈ వేడుక టాలీవుడ్ ఈవెంట్‌లా మారిపోయింది.

Bellamkonda Sai Sreenivas Wedding Reception
8/8

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి వెడ్డింగ్ మరియు రిసెప్షన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు, సెలబ్రిటీలు అందరూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రేమను కురిపిస్తున్నారు.

X