bredcrumb

Peddi Pre Release Event: చరణ్ క్రేజ్, చీరకట్టులో జాన్వీ కనికట్టు... పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు చూశారా?

By Siva Kodati
| Updated: Tuesday, June 2, 2026, 09:01 [IST]

విజయవాడలో ఘనంగా జరిగిన పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా, ఏఆర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా ఈవెంట్ ఫోటోలు  మీ కోసం.

Peddi Pre-Release Event Photos
1/8

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 1వ తేదీన విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం కదిలివచ్చింది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి మెగా అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు చూస్తే.. 

Peddi Pre-Release Event Photos
2/8

రామ్ చరణ్ మాట్లాడుతూ.. విజయవాడ నగరం మా కుటుంబానికి బాగా కలిసొచ్చింది. నాన్నగారికి మంచి విజయాల్ని అందించింది. ఈ అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడిక వచ్చాను. పెద్ద కథ నా హృదయానికి హత్తుకుంది. పదేళ్లకొకసారి మాత్రమే ఇలాంటి కథలు వస్తాయి. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తర్వాత పెద్ది. చనిపోయే వరకు వినోదాన్ని పంచుతూనే ఉంటానని అన్నారు.

Peddi Pre-Release Event Photos
3/8

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికే. పెద్దిపై ప్రేమ చూపిస్తారని ఆశిస్తున్నా.. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పెద్ది ప్రాజెక్ట్ ద్వారా రామ్ చరణ్ గారితో కలిసి నటించే అవకాశం దక్కింది. బుచ్చిబాబు సానా చాలా ప్యాషన్ ఉన్న దర్శకుడు. ప్రేక్షకులే దేవుళ్లు  అని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది.. అదే మాటను నేను కూడా నమ్ముతానని చెప్పారు జాన్వీ.

Peddi Pre-Release Event Photos
4/8

బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ఉప్పెన తర్వాత ఐదేళ్ల పాటు మరో సినిమా చేయకుండా గడిపింది పెద్ది కోసమే. ఉప్పెన కథను విజయవాడలోనే రాసుకున్నా.. తాను తండ్రి కాబోతున్నాననే శుభవార్త కూడా ఇక్కడే తెలుసుకున్నా. బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులు తనపై ఎల్లప్పుడూ ఉంటాయి. నాకు అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ సార్, జాన్వీ మేడంకు థ్యాంక్స్. అప్పలసూరి పాత్రకు ప్రేక్షకుల కళ్లలో నుంచి నీళ్లు వస్తాయి. చరణ్ సార్ లేకపోతే బుచ్చిబాబు అనేవాడు లేదని ఆయన వ్యాఖ్యానించారు. 

Peddi Pre-Release Event Photos
5/8

జగపతిబాబు మాట్లాడుతూ.. నేను పుట్టింది విజయవాడ గడ్డమీదే. బెంజ్ సర్కిల్‌లోని ఓ హాస్పిటల్లో పుట్టాను. విజయవాడోళ్లు మామూలోళ్లు కాదు.. ఈ సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఓ పెద్ద దిక్కు అవుతుంది. అభిమానుల ఆకలి తీర్చే అసలు సిసలు సినిమా ఇది. అరవింద సమేత తర్వాత తనకు దక్కించి మంచి రోల్ ఇదేనని జగపతిబాబు తెలిపారు.

Peddi Pre-Release Event Photos
6/8

నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ.. రామ్ చరణ్ నాకు ఫ్రెండ్, బ్రదర్. పెద్ది కోసం ఆయన చాలా డెడికేషన్‌తో పనిచేశారు. షూటింగ్‌లో రామ్ చరణ్ గారికి 3 సార్లు గాయాలు అయ్యాయి. సర్జరీ కూడా చేయించుకోలేదు. ఈ సినిమా విషయంలో మీకు జరిగిన దానికి క్షమించండి. రెహమాన్ గారు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి గూస్ బంప్స్ వస్తాయి. బుచ్చిబాబు ఓ మోనార్క్ ఏది కావాలంటే అది పట్టుబట్టి మరీ తీసుకుంటాడు. మాకు సహకరించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు.

Peddi Pre-Release Event Photos
7/8

ఏపీ సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ రక్తంలోనే నటన ఉంది. ఆయన కెరీర్‌లోనే రంగస్థలం అద్భుతం. రంగస్థలంలో చరణ్ పరిపక్వత కనిపిస్తుంది. పెద్దిలో నటించడం అంటే చిన్న విషయం కాదు. ఈ సినిమాలో నటించడానికి ఎంతో అంకితభావం కావాలని ఆయన అన్నారు. 

Peddi Pre-Release Event Photos
8/8

విజయవాడ  ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. విజయవాడ సినిమా రాజధాని. ఇక్కడ ఎన్నో శతదినోత్సవాలు జరిగాయి. ఇంద్ర సిల్వర్ జూబ్లీ విజయవాడలోనే జరిగింది. సినిమా మహోత్సవం అంటే ఏంటో చూశారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన తమ్ముడు, బద్రి, ఖుషి ఎన్నో సినిమాలు విజయవాడలో ఆదరించారు. తండ్రిని మించిన తనయుడు, బాబాయ్‌ని మించిన అబ్బాయి రామ్ చరణ్ అని చిన్ని ప్రశంసించారు. 

X