bredcrumb

జాన్వీ గ్లామర్.. రామ్ చరణ్ స్టైల్.. ‘పెద్ది కీ ఆవాజ్’ సూపర్ సక్సెస్..

By Rajesh Karampoori
| Published: Sunday, May 24, 2026, 07:53 [IST]

Peddi: పెద్ది మూవీ ప్రమోషన్స్ లో భాగంగా భోపాల్‌లో ‘పెద్ది కీ ఆవాజ్’ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు రామ్ చరణ్, జాన్వీ కపూర్ సందడి, ఏఆర్ రెహమాన్ హాజరుతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. విడుదలకు ముందు నుంచే ‘పెద్ది’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి. 

Peddi Ki Awaaz
1/6

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం దేశవ్యాప్తంగా భారీ ఈవెంట్లను నిర్వహిస్తూ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది.

Peddi Ki Awaaz
2/6

ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ‘పెద్ది కీ ఆవాజ్’ ఈవెంట్ ఘన విజయం సాధించింది. వేలాది మంది అభిమానులు హాజరై ఈ కార్యక్రమాన్ని ఫుల్ ఎంజాయ్ చేశారు. స్టేడియం మొత్తం ఫ్యాన్స్ కేరింతలతో మారుమోగిపోగా, ‘పెద్ది’పై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ ఈవెంట్ ద్వారా స్పష్టమైంది.

Peddi Ki Awaaz
3/6

ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇవ్వగానే అభిమానులు హర్షధ్వానాలతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. తన స్టైలిష్ లుక్, ఎనర్జిటిక్ ప్రెజెన్స్‌తో చరణ్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక జాన్వీ కపూర్ తన గ్లామర్, చార్మ్‌తో స్టేజ్‌ను మరింత రంగులమయం చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Peddi Ki Awaaz
4/6

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ హాజరు ఈ ఈవెంట్‌కు స్పెషల్ హైలైట్‌గా నిలిచింది. తన సంగీతం ‘పెద్ది’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుందని, కథకు తగ్గట్టుగా ప్రత్యేకంగా ట్యూన్స్ రూపొందించినట్లు తెలిపారు. ఆయన మాటలు అభిమానుల్లో సంగీతంపై అంచనాలను మరింత పెంచాయి.

Peddi Ki Awaaz
5/6

 ఇక చిత్రబృందం ఈ సినిమా కథ గురించి కూడా ఆసక్తికర విషయాలను పంచుకుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు గ్రామీణ వాతావరణం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో ‘పెద్ది’ ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది.

Peddi Ki Awaaz
6/6

ప్రస్తుతం భోపాల్ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్-జాన్వీ కపూర్ కలిసి కనిపించిన క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. విడుదలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతోంది.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+