By
Rajesh Karampoori
| Published: Sunday, May 31, 2026, 20:02 [IST]
‘రాను బొంబాయికి రాను’ పాటతో సంచలనం సృష్టించిన లిఖిత ఇప్పుడు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ డీమాన్ పవన్ హీరోగా నటిస్తున్న ‘సాV3’ చిత్రంలో ఆమె కథానాయికగా కనిపించనుంది. సోషల్ మీడియా స్టార్ లిఖిత, బిగ్‌బాస్ ఫేమ్ డీమాన్ పవన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
1/5
‘రాను బొంబాయికి రాను’ బ్యూటీతో బిగ్‌బాస్ డీమాన్ రొమాన్స్.. సినిమా టైటిల్ ఏంటో తెలుసా? | Ranu Bombayiki Ranu Fame Likhitha Debuts As Heroine Opposite Bigg Boss Star Demon Pawan - Filmibeat Telugu
/photos/feature/ranu-bombayiki-ranu-fame-likhitha-debuts-as-heroine-opposite-bigg-boss-star-demon-pawan-fb107856.html
తెలంగాణ ఫోక్ సాంగ్స్‌లో సంచలనం సృష్టించిన ‘రాను బొంబాయికి రాను’ పాటతో లిఖిత ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. రామ్ రాథోడ్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి. ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 843 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది.
2/5
‘రాను బొంబాయికి రాను’ బ్యూటీతో బిగ్‌బాస్ డీమాన్ రొమాన్స్.. సినిమా టైటిల్ ఏంటో తెలుసా? | Ranu Bombayiki Ranu Fame Likhitha Debuts As Heroine Opposite Bigg Boss Star Demon Pawan - Filmibeat Telugu
/photos/feature/ranu-bombayiki-ranu-fame-likhitha-debuts-as-heroine-opposite-bigg-boss-star-demon-pawan-fb107856.html#photos-1
ఈ పాటతో వచ్చిన క్రేజ్ కారణంగా లిఖితకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు ఫోక్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్‌లో అలరించిన ఆమె ఇప్పుడు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ తెరకెక్కిస్తున్న ‘సాV3’ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది.
3/5
‘రాను బొంబాయికి రాను’ బ్యూటీతో బిగ్‌బాస్ డీమాన్ రొమాన్స్.. సినిమా టైటిల్ ఏంటో తెలుసా? | Ranu Bombayiki Ranu Fame Likhitha Debuts As Heroine Opposite Bigg Boss Star Demon Pawan - Filmibeat Telugu
/photos/feature/ranu-bombayiki-ranu-fame-likhitha-debuts-as-heroine-opposite-bigg-boss-star-demon-pawan-fb107856.html#photos-2
ఈ సినిమాలో సామ్రాట్, బిగ్‌బాస్ ఫేమ్ డీమాన్ పవన్ హీరోలుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
4/5
‘రాను బొంబాయికి రాను’ బ్యూటీతో బిగ్‌బాస్ డీమాన్ రొమాన్స్.. సినిమా టైటిల్ ఏంటో తెలుసా? | Ranu Bombayiki Ranu Fame Likhitha Debuts As Heroine Opposite Bigg Boss Star Demon Pawan - Filmibeat Telugu
/photos/feature/ranu-bombayiki-ranu-fame-likhitha-debuts-as-heroine-opposite-bigg-boss-star-demon-pawan-fb107856.html#photos-3
మరోవైపు డీమాన్ పవన్ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన ఆటతీరుతో టాప్-3 వరకు చేరిన పవన్, తండ్రి చికిత్స కోసం రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్‌ను స్వీకరించి బయటకు రావడంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.
5/5
‘రాను బొంబాయికి రాను’ బ్యూటీతో బిగ్‌బాస్ డీమాన్ రొమాన్స్.. సినిమా టైటిల్ ఏంటో తెలుసా? | Ranu Bombayiki Ranu Fame Likhitha Debuts As Heroine Opposite Bigg Boss Star Demon Pawan - Filmibeat Telugu
/photos/feature/ranu-bombayiki-ranu-fame-likhitha-debuts-as-heroine-opposite-bigg-boss-star-demon-pawan-fb107856.html#photos-4
ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ లిఖిత, బిగ్‌బాస్ ఫేమ్ డీమాన్ పవన్ కలిసి ‘సాV3’తో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఫోక్ సాంగ్‌తో స్టార్‌డమ్ సంపాదించిన లిఖిత హీరోయిన్‌గా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.