bredcrumb

Mehreen Pirzada Haldi Photos: సీక్రెట్‌గా మెహరీన్‌ కౌర్ పెళ్లి.. హల్దీ ఫోటోలు షేర్ చేసిన హనీ పాప!

By Siva Kodati
| Published: Sunday, May 17, 2026, 13:34 [IST]

టాలీవుడ్ నటి మెహ్రీన్ పిర్జాదా ఇటీవల అర్ష్ ఔలక్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. తాజాగా తమ హల్దీ వేడుకల ఫోటోలను మెహ్రీన్ షేర్ చేశారు. 

Mehreen Pirzada Haldi Photos
1/6

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా ఇటీవల వివాహ బంధం ద్వారా ఒక్కటైన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలకు, మీడియాకు దూరంగా ఉంటున్న మెహ్రీన్.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చారు. గత నెల 26న అర్ష్ ఔలఖ్‌ను సిక్కు సాంప్రదాయాల ప్రకారం పెళ్లాడారు మెహ్రీన్.

Mehreen Pirzada Haldi Photos
2/6

పంజాబ్‌కు చెందిన మెహ్రీన్ మోడలింగ్‌ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టారు. 2013లో కెనడాలోని టొరంటోలో జరిగిన మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా కెనడా 2013 కిరీటాన్ని దక్కించుకున్నారు. నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో ఆమె వెండితెరపై అడుగుపెట్టారు. ఈ సినిమాలో మహాలక్ష్మీగా తన అందంతో యువతను కట్టిపడేశారు.

Mehreen Pirzada Haldi Photos
3/6

అనంతరం మహానుభావుడు, రాజా ది గ్రేట్, కేరాఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా, కవచం, ఎఫ్ 2, ఎంత మంచివాడవురా, ఎఫ్ 3 తదితర తెలుగు సినిమాలలో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, పంజాబీ సినిమాలలోనూ మెహ్రీన్ నటించారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా సినీరంగానికి దూరంగా కుటుంబంతోనే ఆమె గడుపుతున్నారు.

Mehreen Pirzada Haldi Photos
4/6

హర్యానా మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ డేటింగ్ చేశారు. 2021 మార్చిలో వీరిద్దరికీ ఘనంగా నిశ్చితార్ధం జరిగింది. త్వరలో పెళ్లి అనుకుంటుండగా మెహ్రీన్- భవ్యలు తమ పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీనికి గల కారణాలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. 

Mehreen Pirzada Haldi Photos
5/6

ఆ క్రమంలో పెళ్లి చేసుకుని సైలెంట్‌గా షాకిచ్చారు మెహ్రీన్ కౌర్ పిర్జాదా. ఏప్రిల్ 26న హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ రిసార్ట్‌లో మెహ్రీన్- అర్ష్‌ ఔలఖ్‌ల పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పంజాబీ సాంప్రదాయంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

Mehreen Pirzada Haldi Photos
6/6

తాజాగా తన పెళ్లికి సంబంధించి హల్దీ వేడుకలను అభిమానులతో పంచుకున్నారు మెహ్రీన్ కౌర్. వివాహం జరిగిన దాదాపు 20 రోజుల తర్వాత వీటిని షేర్ చేయం విశేషం. ఇందులో తన భర్త అర్ష్‌తో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఆమె సరదాగా గడిపారు. మెహ్రీన్‌ను చేతులతో మోస్తూ ముద్దాడుతున్న అర్ష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

X