bredcrumb

Anasuya Bharadwaj: పట్టుచీర కట్టిన అనసూయ.. ఆమె అందం అదుర్స్..

By Rajesh Karampoori
| Published: Friday, January 9, 2026, 22:28 [IST]

Anasuya Bharadwaj: బుల్లితెర బ్యూటీగా యాంకర్ అనసూయ భరద్వాజ్ ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో జబర్దస్త్ షోని అనసూయ అందాల కోసం చూసిన ఆడియన్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. అలాంటి అనసూయ బుల్లితెరకి బైబై చెప్పేసి సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. లెటెస్ట్ పట్టుశారీ ఫోటోలు ఓ లూక్కేయండి.

Anasuya Bharadwaj latest photos
1/6

యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి కామెంట్స్ తో  హాట్ టాపిక్‌గా మారింది. నటుడు శివాజీ ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, మహిళల భద్రత గురించి మాట్లాడేటప్పుడు కేవలం మహిళలకే కాదు, పురుషుల ప్రవర్తనపైనా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అనసూయ పేర్కొన్నారు. మంచి ఉద్దేశంతో మాట్లాడినా, మాటలు సమతుల్యంగా ఉండాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

Anasuya Bharadwaj latest photos
2/6

ఈ సందర్భంగా శివాజీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ, ఆయన సినీ ప్రయాణాన్ని ప్రశంసించిన అనసూయ, సినిమాల్లో పోషించిన పాత్రల ప్రభావం సినిమాల వరకే పరిమితం కావాలని అన్నారు. సమాజంలో మార్పు రావాలంటే అమ్మాయిలను నియంత్రించడంకన్నా, అబ్బాయిలు బాధ్యతగా వ్యవహరించాలన్న సందేశం ఇవ్వాల్సిందని స్పష్టం చేశారు. మహిళల భద్రత అనేది మహిళల ఒక్కరి బాధ్యత కాదని, సమాజమంతా కలిసి తీసుకోవాల్సిన బాధ్యత అని ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది.

Anasuya Bharadwaj latest photos
3/6

ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ కావడంతో ‘అనసూయ vs శివాజీ’ అన్నట్లుగా చర్చలు ఊపందుకున్నాయి. కొందరు అనసూయకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. ట్రోలింగ్ ఎదురైనా, తన స్టాండ్‌ను ఫొటోలు, వీడియోల ద్వారా కూడా స్పష్టంగా తెలియజేస్తూ వెనక్కి తగ్గని తత్వం అనసూయలో కనిపిస్తోందని అభిమానులు చెబుతున్నారు.

Anasuya Bharadwaj latest photos
4/6

ఇదిలా ఉండగా, తాజాగా అనసూయ సంప్రదాయ పట్టుచీరలో కనిపించి మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. నిత్యం ట్రెండీ అవుట్‌ఫిట్స్‌తో కనిపించే ఆమె, ఈసారి పట్టు చీర, మల్లెపూల జడ, సాంప్రదాయ ఆభరణాలతో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా మెరిసింది. ఈ క్లాసిక్ లుక్ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Anasuya Bharadwaj latest photos
5/6

“సంప్రదాయ దుస్తుల్లో మీరే క్వీన్”, “తెలుగుదనం ఉట్టిపడుతోంది” అంటూ అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు. గ్లామర్‌తో పాటు సంప్రదాయాన్ని కూడా సమానంగా మోసుకెళ్లగలిగే అరుదైన వ్యక్తిత్వం అనసూయదేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Anasuya Bharadwaj latest photos
6/6

పలు వెబ్‌సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఈ తాజా ఫోటోషూట్ రాబోయే ప్రాజెక్ట్‌కు సంబంధించినదా లేక సంప్రదాయంపై ఆమెకున్న ప్రేమకు నిదర్శనమా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా, పట్టుచీరలో అనసూయ చూపించిన అందం, ఆత్మవిశ్వాసం ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+