bredcrumb

పాయల్ రాధాకృష్ణ అందాల జాతర.. జిగేల్ అనేలా పాపం ప్రతాప్ బ్యూటీ పరువాలు

By Siva Kodati
| Published: Saturday, April 18, 2026, 19:35 [IST]

నటి పాయల్ రాధాకృష్ణ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. 

Payal Radhakrishna Photos
1/6

తెలుగు తెరపైకి దూసుకొచ్చిన మరో కన్నడ అందం పాయల్ రాధాకృష్ణ. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన పాయల్ రాధాకృష్ణ స్థానికంగానే  చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి భరత నాట్యం నేర్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. కర్ణాటక స్టేట్ బోర్డ్ ఆఫ్ భరత నాట్యం నుంచి సర్టిఫికెట్ పొందారు. ఈ విషయంలో తన తల్లి డాక్టర్ చేతన రాధాకృష్ణ ఆమెకు మార్గదర్శిగా నిలిచారు.

Payal Radhakrishna Photos
2/6

చదువు తర్వాత మోడలింగ్‌లోకి దిగిన పాయల్ రాధాకృష్ణ.. 2014లో ప్రసాద్ బైడప్ప మోడల్ మేనేజ్‌మెంట్‌లో పనిచేశారు. ఆ తర్వాత కొచ్చి, చెన్నై, హైదరాబాద్, ముంబైలలో ఫ్రీలాన్సర్‌గా పనిచేశారు పాయల్. మోడల్‌గా పలు టాప్ బ్రాండ్స్‌కు చెందిన వాణిజ్య ప్రకటనల్లో నటించారు. ఈ దశలో ఆమెకు సినీ రంగం నుంచి అవకాశాలు వచ్చాయి. 

Payal Radhakrishna Photos
3/6

2017లో బెంగళూరు అండర్‌ వరల్డ్ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత డిఫరెంట్ అనే మరో కన్నడ మూవీలో నటించారు. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. తరగతి గది దాటి, అలా నిన్ను చేరి, ప్రసన్న వదనం, సత్యభామ, నీలి మేఘ శ్యామ, కుమార సంభవం, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర సినిమాలలో నటించారు.

Payal Radhakrishna Photos
4/6

ఇటీవల రిలీజైన పాపం ప్రతాప్ మూవీలో హీరోయిన్‌గా నటించారు పాయల్ రాధాకృష్ణ. ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తిరువీర్ హీరోగా నటించారు. అజయ్ ఘోష్, రాశి, దేవిప్రసాద్, గోపరాజు రమణ, రవి ఆంటోనీ, రఘుబాబు, ప్రసాద్ బెహరా, అనంత్ బాబు, బాషా, శ్రీనివాస్ అవసరాల తదితరులు ఈ చిత్రంలో నటించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న పాపం ప్రతాప్ మూవీ విడుదలైంది.

Payal Radhakrishna Photos
5/6

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పాయల్ రాధాకృష్ణ.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలతో పాటు భరతనాట్యం వీడియోలు, ఇతర సంగతులను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. మోడ్రన్ డ్రెస్సుల్లో, చీరలో ఫోటోషూట్స్ చేసి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ సెగలు రేపుతారు. 

Payal Radhakrishna Photos
6/6

పాపం ప్రతాప్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని పాయల్ రాధాకృష్ణ భావిస్తున్నారు. అందంతో పాటు డ్యాన్స్‌లోనూ ఎక్స్‌పర్ట్ కావడంతో రానున్న రోజుల్లో టాలీవుడ్‌లో ఈ కన్నడ కస్తూరి గట్టిగానే జెండా పాతే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 

X