bredcrumb

కొంటె చూపులతో కవిస్తోన్న చిట్టి... జీన్స్‌లో ఫరియా అబ్ధుల్లా ఫోటోలు వైరల్!

By Siva Kodati
| Published: Wednesday, April 29, 2026, 22:26 [IST]

సినీనటి ఫరియా అబ్ధుల్లా లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

Faria Abdullah Photos
1/6

హైదరాబాద్‌కు చెందిన అచ్చ తెలుగు అమ్మాయి ఫరియా అబ్ధుల్లా. ఆమె పూర్తి పేరు.. ఫరియా సుల్తానా బేగం. జాతిరత్నాలు తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి ఆడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలారా 2, గుర్రం పాపిరెడ్డి, అనగనగా ఒకరాజు సినిమాలో నటించారు.

Faria Abdullah Photos
2/6

ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన గాయపడ్డ సింహం మూవీలో కీలకపాత్ర పోషించింది ఫరియా. గెస్ట్ రోల్ అయినప్పటికీ తరుణ్ భాస్కర్‌తో రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుందని ఈ ముద్దుగుమ్మ చెప్పింది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గాయపడ్డ సింహం మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Faria Abdullah Photos
3/6

గాయపడ్డ సింహంలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గాయపడ్డ సింహంపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది ఫరియా. 

Faria Abdullah Photos
4/6

ఫరియా అబ్ధుల్లా మల్టీ టాలెంటెడ్. నటన మాత్రమే కాదు.. ఆమెలో సింగర్, డ్యాన్సర్, రచయిత కూడా ఉన్నారు. మత్తు వదలరా 2లో సొంతంగా ర్యాప్ సాంగ్ రాసిన ఆమె.. స్వయంగా ఆలపించారు. అంతేకాదు ఈ సాంగ్‌కి ‌కొరియోగ్రఫి కూడా చేసి తన టాలెంట్ నిరూపించుకున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ రాణిస్తున్నారు ఫరియా అబ్ధుల్లా. 

Faria Abdullah Photos
5/6

ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలన్నది తన కల అని ఫరియా పలుమార్లు బయటపెట్టారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది తాను మెగాఫోన్ పడతానని ఫరియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నానని.. త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తానని అన్నారు. 

Faria Abdullah Photos
6/6

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఫరియా అబ్ధుల్లా సినిమాలు, వ్యక్తిగత వివరాలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో మతిపొగొట్టేస్తుంది. ఆమె పోస్ట్ చేసే రీల్స్, వీడియోస్‌ బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+