bredcrumb

న‌డుము మడతలో దాగిన హొయలు.. పెద్ది’ హీరోయిన్ లుక్స్‌కు నెటిజెన్లు ఫిదా!

By Rajesh Karampoori
| Published: Tuesday, April 14, 2026, 16:55 [IST]

రామ్ చరణ్ ‘పెద్ది’ హీరోయిన్ జాన్వీ క‌పూర్ (Janhvi kapoor) తాజాగా వైట్ డ్రెస్‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అచ్చం దేవ‌క‌న్య‌లా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లూక్కేయండి. 

Janhvi Kapoor latest photos
1/6

బాలీవుడ్ స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి జాన్వి కపూర్ (Janhvi kapoor). అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ రంగంలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూనే, తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

Janhvi Kapoor latest photos
2/6

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని వేగంతో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల భామ, తన గ్లామర్, నటనతో ఇక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ భారీ స్థాయిలో వసూళ్లు సాధించడంతో, జాన్వీకి టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. 

Janhvi Kapoor latest photos
3/6

ప్రస్తుతం రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’లో హీరోయిన్‌గా నటిస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో జాన్వీ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ చిత్రంలో జాన్వీ ఒక విభిన్నమైన గ్లామరస్ రోల్‌లో కనిపిస్తుందని సమాచారం. జాన్వీ గ్లామర్ యాటిట్యూడ్ కి మెగా ఫ్యాన్స్ కిల్ అవ్వడం ఖాయం. `పెద్ది`సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Janhvi Kapoor latest photos
4/6

ఇదిలా ఉండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాకా’లో కూడా జాన్వీకి కీలక పాత్ర దక్కినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికే నటిస్తున్నారు, జాన్వీకి ప్రత్యేక పాత్ర ఇవ్వబోతున్నారని సమాచారం. ఇది నిజమైతే ఆమె కెరీర్‌కు మరింత బూస్ట్ ఇవ్వనుంది.

Janhvi Kapoor latest photos
5/6

కెరీర్ ప్రారంభంలో ‘ధడక్’ సినిమాతో వచ్చినప్పుడు విమర్శలు ఎదుర్కొన్న జాన్వీ, ఇప్పుడు తన టాలెంట్, గ్లామర్, ఫ్యాషన్ సెన్సార్‌లతో విమర్శకులనే మెప్పిస్తోంది. సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటూ, మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది. ప్రతి పోస్ట్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ, ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

Janhvi Kapoor latest photos
6/6

ఫ్యాషన్ సెన్స్ విషయంలో కూడా జాన్వీ కపూర్ టాప్‌లోనే ఉంటుంది. వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్ నుంచి ట్రెడిషనల్ చీరల వరకు ఏదైనా స్టైల్‌లోనూ ఒదిగిపోగలిగే ఈ బ్యూటీ, ప్రతి లుక్‌తో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. తాజాగా వైట్ ఫ్రాక్‌లో చేసిన ఫోటోషూట్ ఆమె గ్లామర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. నడుము అందాలు హైలైట్ అయ్యేలా ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అందాన్ని చూసి నెటిజెన్లు “దేవకన్యలా ఉంది” అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా బ్యాక్‌లెస్ ఫ్రాక్‌లో ఆమె గ్లామర్ లుక్స్ యువతలో మంచి క్రేజ్ తెచ్చాయి. 

X