bredcrumb

Tamilnadu Elections 2026 : తమిళనాడు ఎన్నికలు.. ఓటు వేసిన సెలబ్రిటీలు..

By Rajesh Karampoori
| Updated: Thursday, April 23, 2026, 19:13 [IST]

Tamil Nadu Elections 2026: తమిళనాడు ఎన్నికల్లో రజనీకాంత్, విజయ్, అజిత్, కమల్ హాసన్, త్రిష, సూర్య తదితర సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నై పోలింగ్ బూత్‌ల వద్ద తీసిన సెలబ్రిటీల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tamil Nadu Elections 2026
1/9

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుండగా, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రతి ఎన్నికల సమయంలోలాగే ఈసారి కూడా కోలీవుడ్ స్టార్స్ పోలింగ్ బూత్‌ల వద్ద సందడి చేశారు. అభిమానులు, మీడియా, ఓటర్ల మధ్య వీరి రాక ఉత్సాహాన్ని నింపింది. ప్రముఖ సినీ దర్శకుడు అట్లీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఆయన సాధారణ పౌరుడిలా క్యూలో వేచి ఉండి, తన ఓటు హక్కును అమలు చేశారు. 

Tamil Nadu Elections 2026
2/9

కోలీవుడ్ స్టార్ విక్రమ్ బసంత్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. యువత ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించేలా ఈ దృశ్యాలు నిలిచాయి.

Tamil Nadu Elections 2026
3/9

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కూడా చెన్నై తిరువాన్మియూర్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే అజిత్, ప్రశాంతంగా వచ్చి ఓటు వేసి వెళ్లడం చర్చనీయాంశమైంది. అభిమానులు ఆయన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Tamil Nadu Elections 2026
4/9

ప్రముఖ తమిళ నటుడు ధనుష్ తన ఓటు హక్కును చెన్నైలోని అల్వార్‌పేటలోని పోలింగ్ బూత్‌లో వినియోగించుకున్నారు.   

Tamil Nadu Elections 2026
5/9

సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా చేరుకున్నారు. వయసు పెరిగినా ప్రజాస్వామ్యంపై తన బాధ్యతను నెరవేర్చడం అభిమానులను ఆకట్టుకుంది.

Tamil Nadu Elections 2026
6/9

టీవీకే అధినేత, స్టార్ హీరో విజయ్ ఉదయం తొందరగానే నీలాంకరైలో ఓటు వేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన వేసిన ఓటు కావడంతో ఇది ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

Tamil Nadu Elections 2026
7/9

తమిళ నటుడు శివ కార్తికేయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన భార్యతో కలిసి చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. 

Tamil Nadu Elections 2026
8/9

నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తన కుమార్తె శ్రుతి హాసన్తో కలిసి ఆల్వార్‌పేట్‌లోని పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేశారు. తండ్రి-కుమార్తె కలిసి ఓటు వేయడం అభిమానులను ఆకట్టుకుంది. కమల్ హాసన్ ప్రజాస్వామ్య బాధ్యతపై ఎప్పటిలాగే చురుకైన సందేశం ఇచ్చారు.

Tamil Nadu Elections 2026
9/9

ప్రముఖ నటి త్రిష అభిరామపురం ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సింపుల్ లుక్‌లో వచ్చిన ఆమెను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు ఓటింగ్‌లో పాల్గొనాలని ఆమె పరోక్షంగా ప్రోత్సహించినట్లు అభిమానులు భావిస్తున్నారు.

X