bredcrumb

ఎద అందాలతో కుర్రకారుని కట్టిపడేసిన కాంత బ్యూటీ.. భాగ్యశ్రీ బోర్సే లేటెస్ట్ ఫోటోషూట్ హల్‌చల్

By Rajesh Karampoori
| Published: Friday, November 7, 2025, 21:02 [IST]

Bhagyashree Borse: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా చేసిన ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తోంది. స్టైలిష్ లుక్‌లో ఆమె ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ ఫోటోలపై అభిమానులు ఫిదా అవుతున్నారు.ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

Bhagyashree Borse
1/6

యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) మాస్ మహారాజా రవితేజ సరసన నటించిన “మిస్టర్ బచ్చన్” సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా పెద్దగా ఆడకపోయినా, భాగ్యశ్రీకి గుర్తింపు మాత్రం బాగా దక్కింది.

Bhagyashree Borse
2/6

ఆ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారింది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోషూట్లు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ, యువత హృదయాలను గెలుచుకుంటున్నాయి. మొదటి సినిమా ఫెయిల్ అయినా, నిర్మాతలు ఆమెకు వరుస ఆఫర్లు ఇస్తున్నారు. ప్లాపులు ఎదురైనా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.

Bhagyashree Borse
3/6

తర్వాత ఆమె విజయ్ దేవరకొండతో కలిసి “కింగ్డమ్” సినిమాలో నటించింది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నా, బాక్సాఫీస్ వద్ద ఫలితం నిరాశపరిచింది. సినిమాలో భాగ్యశ్రీకి ఎక్కువ స్క్రీన్ టైమ్ లేకపోయినా, గ్లామరస్ లుక్‌తో మళ్లీ అభిమానులను ఆకట్టుకుంది.

Bhagyashree Borse
4/6

ప్రస్తుతం భాగ్యశ్రీ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటిస్తున్న “కాంత” (Kantha) సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా, రానా దగ్గుబాటి, సముద్రఖని వంటి నటులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె తమిళ ప్రేక్షకులకు పరిచయం కానుంది.

Bhagyashree Borse
5/6

ఇదే నెల 28న భాగ్యశ్రీ రామ్ పోతినేనితో కలిసి నటించిన “ఆంధ్రా కింగ్ తాలూక” సినిమా థియేటర్లలోకి రాబోతోంది. రెండు సినిమాలు ఒకే నెలలో విడుదల కావడంతో ఆమెకు ఇది లక్ టెస్ట్‌లా మారింది. ఈ రెండు సినిమాల్లో ఏదైనా హిట్ అయితే ఆమె కెరీర్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.

Bhagyashree Borse
6/6

మొత్తం మీద భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం టాలీవుడ్‌లో రైజింగ్ స్టార్‌గా ఎదుగుతోంది. గ్లామర్, టాలెంట్, కష్టపడి పనిచేయాలనే తపన ఆమెను ముందుకు తీసుకెళ్తోంది. ఈ నవంబర్ ఆమెకు నిజమైన టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి.

X