బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష మొదటగా హౌస్‌లోకి అడుగుపెట్టింది . ఎంట్రీ ఇచ్చిన వెంటనే “పక్కా లోకల్” సాంగ్‌పై తన అద్భుత డ్యాన్స్‌తో దుమ్ము రేపింది.


Click it and Unblock the Notifications
Ramya Moksha : బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ద్వారా మొదటి కంటెస్టెంట్‌గా అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష హౌస్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం పికిల్స్ పాప రమ్య మోక్ష ఫోటోలు వైరల్ గా మారాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష మొదటగా హౌస్‌లోకి అడుగుపెట్టింది . ఎంట్రీ ఇచ్చిన వెంటనే “పక్కా లోకల్” సాంగ్‌పై తన అద్భుత డ్యాన్స్‌తో దుమ్ము రేపింది.
రమ్య, అలేఖ్య, సుమ అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు రాజమండ్రి ప్రాంతానికి చెందినవారు. ముగ్గురూ సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లుగా బాగా ఫేమస్ అయ్యారు. ఫిట్‌నెస్ వీడియోలు, హెల్త్ టిప్స్, ఫన్నీ రీల్స్‌తో రమ్యకు మంచి ఫాలోయింగ్ వచ్చింది.
ఆ తర్వాత కుటుంబంగా కలిసి “అలేఖ్య చిట్టి పికిల్స్” పేరుతో పికిల్స్ బిజినెస్ ప్రారంభించి వెజ్, నాన్-వెజ్ వంటివన్నీ అమ్మడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో తమ మార్కెటింగ్ స్ట్రాటజీతో బిజినెస్‌ని బూస్ట్ చేశారు.
వారి ఫేమ్ రమ్యకు సమస్యలకూ దారి తీసింది. ఓ కస్టమర్ “మీ పికిల్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి” అని కామెంట్ చేయడంతో రమ్య క్షణికావేశంలో బూతులతో స్పందించింది. ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి రమ్యకు భారీ ట్రోలింగ్ తెచ్చింది. వ్యాపారపరంగా కూడా నష్టం జరిగి, పికిల్స్ బిజినెస్ దాదాపు క్లోజ్ చేయాల్సి వచ్చింది. అది నా జీవితంలో జరిగిన పెద్ద తప్పు అంటూ నాగార్జున ముందు అంగీకరించింది
తన తండ్రి మరణం జీవితాన్ని మార్చేసిందనీ, తన తండ్రి మరణించిన రోజు ఒక సినిమా షూటింగ్ కోసం కొడైకెనాల్ వెళ్లినట్టు తెలిపింది. తన తండ్రిని చివరిసారిగా సరిగా చూసుకోలేకపోయానంటూ ఎమోషనల్ అయింది. ఈ సంఘటన తర్వాతే ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, అనవసరమైన విమర్శలు, తిట్లు ఎక్కువయ్యాయని చెప్పింది
ప్రస్తుతం రమ్య తన స్ట్రాంగ్ పర్సనాలిటీ, కాన్ఫిడెంట్ టాక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఫేస్ చేసినా, ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా కొత్త ఛాన్స్ దొరికిందని చెబుతోంది. మరి ఈ రాజమండ్రి రోజ్‌మిల్క్ క్వీన్ రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ చేస్తుందా? లేక మళ్లీ వివాదాల్లో ఇరుక్కుంటుందా? అన్నది చూడాల్సిందే!