bredcrumb

చెల్లి పెళ్లిలో తన ప్రియుడిని పరిచయం చేసిన స్టార్ హీరోయిన్ ? క్రేజీ ఫోటోలు వైరల్

By Rajesh Karampoori
| Published: Monday, January 19, 2026, 21:05 [IST]

Kriti Sanon : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ డేటింగ్ రూమర్స్ తో వార్తల్లో నిలిచింది, నుపుర్ సనన్ పెళ్లిలో కానీ కబీర్ బహియా షేర్ చేసిన పెళ్లి ఫోటోలు డేటింగ్ రూమర్స్‌ను మళ్లీ రాజేశాయి.వైరల్ ఫోటోలు బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి.

Kriti Sanon
1/6

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న కృతి సనన్ (Kriti Sanon) వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రేమ, డేటింగ్‌కు సంబంధించిన రూమర్లు కృతిని ఎప్పటికప్పుడు వెంబడిస్తూనే ఉంటాయి. గతంలో ఆదిపురుష్ సినిమా సమయంలో ప్రభాస్ (Prabhas)తో ఆమె ప్రేమలో ఉందంటూ ప్రచారం జరిగినా, ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అవన్నీ రూమర్లుగానే ముగిశాయి. అయితే ఇప్పుడు కొత్తగా లండన్‌కు చెందిన బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

Kriti Sanon
2/6

తాజా కథనాల ప్రకారం.. కృతి లండన్ బేస్డ్ బిజినెస్‌మ్యాన్ కబీర్ బాటియా (Kabir Bahia) తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సాధారణంగా తన ప్రైవేట్ లైఫ్‌ను చాలా గోప్యంగా ఉంచే కృతి, ఈసారి మాత్రం పలు సందర్భాల్లో కబీర్‌తో కలిసి కనిపించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. చెల్లెలు నుపుర్ సనన్ పెళ్లి వేడుకలో, లార్డ్స్ క్రికెట్ మ్యాచ్‌లో ఇద్దరూ కలిసి కనిపించడం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

Kriti Sanon
3/6

ఇద్దరూ కలిసి గ్రీస్, ఫ్రాన్స్ వంటి దేశాలకు విహారయాత్రలు చేశారనే ప్రచారం కూడా ఉంది. అంతేకాదు, కృతి సోషల్ మీడియాలో షేర్ చేసిన ‘నా పిచ్చిని భరించే ఏకైక వ్యక్తి ఇతనే’ అనే క్యాప్షన్ ఉన్న పోస్ట్ కూడా అభిమానుల్లో కొత్త అనుమానాలను రేకెత్తించింది. అయితే ఈ వ్యవహారంపై కృతి గానీ, కబీర్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇది నిజమా? రూమరా? అన్న ప్రశ్నకు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Kriti Sanon
4/6

ఇదిలా ఉంటే, కృతి కెరీర్ ప్రయాణం కూడా ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. చాలామంది ఆమె బాలీవుడ్ డెబ్యూ హీరోపంతి (Heropanti)తోనే అనుకుంటారు. కానీ అంతకు ముందే తెలుగులో  1 నేనొక్కడినే ద్వారా మహేశ్ బాబు సరసన నటించి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

Kriti Sanon
5/6

దిల్‌వాలే, బరేలీ కి బర్ఫీ, లుకా చుప్పీ వంటి సినిమాలతో కృతికి కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. సరోగేట్ మదర్ పాత్రలో ఆమె చేసిన నటనకు జాతీయ స్థాయి ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంతో కృతి నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం ఆమె ప్రతిభకు గుర్తింపుగా నిలిచింది.నటనతో పాటు వ్యాపార రంగంలోనూ కృతి సత్తా చాటుతోంది. 

Kriti Sanon
6/6

ఫ్యాషన్ లేబుల్ Ms Taken, బ్యూటీ బ్రాండ్ Hyphen ద్వారా రూ.400 కోట్లకు పైగా రెవెన్యూ సాధించి, ఒక పవర్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారింది. ఇలా సినిమాలు, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగుతున్న కృతి సనన్ గురించి వచ్చే డేటింగ్ రూమర్లు నిజమో కాదో తేలాలంటే ఆమె నుంచి అధికారిక స్పందన రావాల్సిందే. అప్పటివరకు ఈ ప్రచారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా కొనసాగడం ఖాయం.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+