bredcrumb

Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్- కావ్యరెడ్డి నిశ్చితార్థం గ్రాండ్‌గా.. ‘శ్రీనివాస కావ్యనం’ ఫోటోలు చూశారా?

By Rajesh Karampoori
| Published: Tuesday, April 7, 2026, 20:39 [IST]

Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య రెడ్డి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. 'శ్రీనివాస కావ్యనం' (SreenivasaKavyanam) అనే పేరుతో జరిపిన నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ఈ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘శ్రీనివాస కావ్యనం’ ఫోటోలపై ఓ లూక్కేయండి.   

Bellamkonda Sreenivas -Kavya Reddy Engagement
1/8

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్న ఆయన, కావ్య రెడ్డి అనే యువతిని వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ జంట ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చినట్టు ఇండస్ట్రీలో చర్చలు జరుగుతుండగా, తాజాగా జరిగిన నిశ్చితార్థ వేడుకతో ఈ వార్తలకు అధికారిక ముద్ర పడింది.

Bellamkonda Sreenivas -Kavya Reddy Engagement
2/8

ఇటీవల జరిగిన రోకా వేడుకలోనే తన కాబోయే జీవిత భాగస్వామిని పరిచయం చేసిన బెల్లంకొండ సాయి, ఇప్పుడు గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 5న ఆదివారం హైదరాబాద్‌లోని ఓ లగ్జరీ రిసార్ట్‌లో ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది.

Bellamkonda Sreenivas -Kavya Reddy Engagement
3/8

‘శ్రీనివాస కావ్యనం’ అనే థీమ్‌తో జరిగిన ఈ నిశ్చితార్థం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకలో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి ఇద్దరూ మ్యాచింగ్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిపోయారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్టేజ్, డెకరేషన్, ఫ్యామిలీ బాండింగ్ ఈ వేడుకను మరింత అందంగా మలిచాయి.

Bellamkonda Sreenivas -Kavya Reddy Engagement
4/8

నిశ్చితార్థంలో ముఖ్య ఘట్టంగా, సాయి శ్రీనివాస్ తన ప్రేయసి కావ్య చేతికి ఉంగరం తొడగడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బెల్లంకొండ ఫ్యామిలీతో కలిసి తీసుకున్న ఫోటోలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Bellamkonda Sreenivas -Kavya Reddy Engagement
5/8

ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, అలాగే రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు హాజరైనట్టు సమాచారం. అయితే ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా ప్రైవేట్‌గా ఉంచి, కేవలం దగ్గరి వారి సమక్షంలోనే నిర్వహించడం గమనార్హం. అందుకే ఈ ఎంగేజ్‌మెంట్‌కు మరింత స్పెషల్ ఫీలింగ్ వచ్చింది.

Bellamkonda Sreenivas -Kavya Reddy Engagement
6/8

ఇక పెళ్లి విషయానికి వస్తే, ఎంగేజ్‌మెంట్‌ను గ్రాండ్‌గా చేసినప్పటికీ, వివాహాన్ని మాత్రం సింపుల్‌గా నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 29న తిరుమలలో శ్రీవారి సన్నిధిలో ఈ జంట పెళ్లి జరగనుంది. అనంతరం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Bellamkonda Sreenivas -Kavya Reddy Engagement
7/8

కావ్య రెడ్డి గురించి కూడా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె హైదరాబాదుకు చెందినవారని, మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది. ఆమె తాత జడ్జిగా పనిచేసినట్టు, తండ్రి లాయర్ అని సమాచారం. కావ్య చెల్లెలు, బెల్లంకొండ శ్రీనివాస్ ఒకే కాలేజీలో చదవడం ద్వారా ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది క్రమంగా ప్రేమగా మారిందని టాక్ వినిపిస్తోంది.

Bellamkonda Sreenivas -Kavya Reddy Engagement
8/8

ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ వంటి సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, వ్యక్తిగత జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతుండటం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. మొత్తానికి, ఈ జంట పెళ్లి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 

X