By
Siva Kodati
| Published: Thursday, January 22, 2026, 21:03 [IST]
సినీనటి పూజిత పొన్నాడ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఓ ఫొటో షూట్‌ను షేర్ చేసింది.
1/5
ముంబై తీరంలో పూజిత పొన్నాడ చక్కర్లు... చీరలో వీరమల్లు బ్యూటీ గ్లామర్ ట్రీట్! | Hari Hara Veera Mallu Actress Pujita Ponnada Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/hari-hara-veera-mallu-actress-pujita-ponnada-stunning-photos-goes-viral-fb104752.html
అచ్చ తెలుగు అమ్మాయి అయ్యుండి తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం నిరీక్షిస్తున్న ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. అంజలి, అనన్య నాగళ్ల, ఈషా రెబ్బా ఇలా చూస్తే ఈ లిస్ట్ చాలా ఉంది. సరైన అవకాశం రాకపోదా అని వీరంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు పూజిత పొన్నాడ.
2/5
ముంబై తీరంలో పూజిత పొన్నాడ చక్కర్లు... చీరలో వీరమల్లు బ్యూటీ గ్లామర్ ట్రీట్! | Hari Hara Veera Mallu Actress Pujita Ponnada Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/hari-hara-veera-mallu-actress-pujita-ponnada-stunning-photos-goes-viral-fb104752.html#photos-1
అందం, అభినయం ఉన్నప్పటికీ పూజితకు స్టార్‌డమ్ అందనీ ద్రాక్షలా మారింది. దాంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బండిని లాగిస్తున్నారు. చివరికి సెకండ్ హీరోయిన్‌గానే ఆమె సరిపెట్టుకోవాల్సి వస్తుంది. వైట్ స్కిన్ టోన్, మత్తెక్కించే నవ్వు, మంచి కటౌట్‌తో పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్న ఈ భామ ఎందుకో స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. చివరికి సెకండ్ లీడ్‌గా చిన్నా చితకా పాత్రలు చేస్తోంది.
3/5
ముంబై తీరంలో పూజిత పొన్నాడ చక్కర్లు... చీరలో వీరమల్లు బ్యూటీ గ్లామర్ ట్రీట్! | Hari Hara Veera Mallu Actress Pujita Ponnada Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/hari-hara-veera-mallu-actress-pujita-ponnada-stunning-photos-goes-viral-fb104752.html#photos-2
విశాఖపట్నానికి చెందిన పూజిత చెన్నైలో పుట్టి పెరిగారు. బీటెక్ పూర్తయ్యక కొంతకాలం ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. అయితే సినిమాలపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేశారు పూజిత పొన్నాడ. ఈ క్రమంలోనే కొన్ని షార్ట్ ఫిలింస్‌లో నటించారు. ఉప్మా తినేసింది, ఏ సాటర్‌డే ఈవెనింగ్, బూచీ, దీపికా పదుకొనె, పరిణయం వంటి షార్ట్ ఫిలింస్‌తో యూత్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు పూజిత
4/5
ముంబై తీరంలో పూజిత పొన్నాడ చక్కర్లు... చీరలో వీరమల్లు బ్యూటీ గ్లామర్ ట్రీట్! | Hari Hara Veera Mallu Actress Pujita Ponnada Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/hari-hara-veera-mallu-actress-pujita-ponnada-stunning-photos-goes-viral-fb104752.html#photos-3
ఈ క్రమంలోనే కింగ్ అక్కినేని నాగార్జున - కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన ఊపిరిలో ఓ చిన్న రోల్‌తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు పూజిత పొన్నాడ. అనంతరం ప్రేమమ్, దర్శకుడు, రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, 7, కల్కి , రన్, మిస్ ఇండియా , కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వేస్టేషన్, ఆకాశ వీధిలో, రావణాసుర, జోరుగా హుషారుగా వంటి చిత్రాల్లో నటించారు.
5/5
ముంబై తీరంలో పూజిత పొన్నాడ చక్కర్లు... చీరలో వీరమల్లు బ్యూటీ గ్లామర్ ట్రీట్! | Hari Hara Veera Mallu Actress Pujita Ponnada Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/hari-hara-veera-mallu-actress-pujita-ponnada-stunning-photos-goes-viral-fb104752.html#photos-4
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలంతో పూజిత పొన్నాడ బ్రేక్ అందుకున్నారు. గతేడాది పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లులో ఐటెం సాంగ్‌లో నర్తించారు. ప్రస్తుతం తమిళ్‌లో భగవాన్ అనే చిత్రంలో పూజిత పొన్నాడ నటిస్తున్నారు.