bredcrumb

Sobhita Dhulipala Photos: అందాల ఆరబోతలో శోభితా ధూళిపాళ్ల అరాచకం..

By Rajesh Karampoori
| Published: Monday, September 23, 2024, 19:49 [IST]

Sobhita Dhulipala Photos: అక్కినేని వారసుడు నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత  శోభితా ధూళిపాళ్ల  సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది. ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Sobhita Dhulipala Photos
1/6

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వెడ్ సిరీస్, మూవీస్‌లో బోల్డ్ పాత్రలతో స్టార్ హీరోయిన్‌గా శోభితా ధూళిపాల మెప్పిస్తున్నది. విభిన్నమైన పాత్రలతో ఆమె తనకంటూ ఇమేజ్ సంపాదించుకొన్నది.
Sobhita Dhulipala Photos
2/6

ప్రస్తుతం శోభితా ధూళిపాళ్ల పేరు మారుమోగిపోతోంది. తాజాగా అక్కినేని వారసుడు నాగ చైతన్య (Naga Chaitanya)తో శోభిత ఎంగేజ్‌మెంట్ జరిగింది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు
Sobhita Dhulipala Photos
3/6

శోభిత తెలుగు అమ్మాయి. ఆమె 1992, మే 31న ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో జన్మించింది. ఆమె తండ్రి వేణుగోపాల్ రావు నేవీ అధికారి, తల్లి శాంత కామాక్షి టీచర్. శోభిత విశాఖపట్నంలో పెరిగింది. లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో చదివింది. పైచదువుల కోసం ముంబై వెళ్లిన ఆమె, ముంబై యూనివర్సిటీలోని హెచ్.ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ & ఎకనామిక్స్ లో చదివింది.
Sobhita Dhulipala Photos
4/6

చిన్నప్పటి నుంచి శోభితకు కళలపై మక్కువ. దీంతో సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో శిక్షణ తీసుకుంది. అలాగే, నేవీ బాల్ పిన్ 2010లో నేవీ క్వీన్‌గా ఎంపికైంది.
Sobhita Dhulipala Photos
5/6

స్నేహితుతల ప్రోత్సాహంతో మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు . ఇండియాలోకి ప్రముఖ మోడల్స్ ఒకరిగా పేరు తెచ్చుకుంది. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ ను సొంతం చేసుకుంది.
Sobhita Dhulipala Photos
6/6

ఈ అమ్మడు అనంతరం 2016లో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. విక్కీ విశాల్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన 'రామన్ రాఘవ్ 2.0'తో ఆమె నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'చెఫ్', 'కళాకంది' అనే హిందీ చిత్రాల్లో నటించిన శోభిత.. అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
X