bredcrumb

Nabha Natesh: తెల్ల చీరలో నభా నటేష్ అందాలు.. బెడ్‌పై అలాంటి ఫోజుల్లో సెగలు!

By Siva Kodati
| Published: Saturday, July 12, 2025, 20:02 [IST]

ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా స్టైలీష్ లుక్‌లో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది.

Nabha Natesh Photos
1/5

అందం, అభినయం, టాలెంట్ ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లకు అవకాశాలు రావు.. వచ్చినా స్టార్‌డమ్ మాత్రం దక్కదు. ఈ  కేటగిరీలోకే వస్తారు కన్నడ కస్తూరి నభా నటేష్. 2018లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే మూవీ ద్వారా తెలుగువారిని పలకరించిన ఆమెకు ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్రేక్ ఇచ్చింది. 

Nabha Natesh Photos
2/5

11 డిసెంబర్ 1995న కర్ణాటకలోని శృంగేరీలో జన్మించిన నభా నటేష్ భరత నాట్యం, వెస్ట్రన్ డ్యాన్స్‌లలో ప్రావీణ్యురాలు. పలు ప్రదర్శనలు కూడా ఇచ్చి శెభాష్ అనిపించుకున్నారు. కన్నడ సూపర్‌స్టార్, డాక్టర్ శివరాజ్ కుమార్ నటించిన వజ్రకాయతో సినీరంగ ప్రవేశం చేశారు. అప్పటికీ ఆమె వయసు 19 ఏళ్లు కావడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో నభా నటేష్‌కు అవకాశాలు క్యూకట్టాయి.

Nabha Natesh Photos
3/5

ఇస్మార్ట్ శంకర్ తర్వాత తెలుగులో డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో, డార్లింగ్ వంటి చిత్రాలలో నటించారు. మ్యాస్ట్రో తర్వాత ఆమె మూడేళ్లు గ్యాప్ తీసుకున్నారు. 2024లో చివరిసారిగా డార్లింగ్‌లో నటించారు. ఆ తర్వాత కొత్తగా ఏ ప్రాజెక్ట్‌కు నభా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

Nabha Natesh Photos
4/5

ఓ ఇంటర్వ్యూలో తాను సినిమాల్లోకి రావడానికి ఎంత కష్టపడింది వివరించారు నభా నటేష్. బెంగళూరులో మోడలింగ్ చేస్తూనే.. ఓ నాటక బృందంతో కలిసి పనిచేశానని, వీధుల్లో నాటకాలు కూడా వేసినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. నాటకాల్లో వచ్చిన అనుభవంతోనే సినిమాలలో ప్రయత్నించి వజ్రకాయలో అవకాశం దక్కించుకున్నట్లు నభా నటేష్ తెలిపారు.

Nabha Natesh Photos
5/5

వజ్రకాయ కోసం మూడు నెలల  పాటు ట్రైనింగ్ తీసుకున్నానని.. పల్లెటూరి అమ్మాయిలా కనిపించడం కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నానని, బీడీలు కూడా కాల్చానని .. బీడీ కంపుతో కొద్దిరోజులు భోజనం కూడా చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన  కష్టానికి ప్రతిఫలంగా వజ్రకాయ సంచలన విజయం సాధించిందని నభా నటేష్ గుర్తుచేసుకున్నారు. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+