By
Siva Kodati
| Published: Friday, January 9, 2026, 20:53 [IST]
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా పరాశక్తి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ఆ ఫోటోలు మీకోసం
1/5
పరాశక్తి కోసం వింటేజ్ లుక్‌లో శ్రీలీల... 1960లలో రత్నమాల ఎలా ఉందో చూశారా? | Parasakthi Actress Sreeleela's Look In Vintage 1960s Style, Featuring Traditional Outfits For Her Character - Filmibeat Telugu
/photos/feature/parasakthi-actress-sreeleelas-look-in-vintage-1960s-style-featuring-traditional-outfits-for-her-character-fb104581.html
హిట్ట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు శ్రీలీల. గతేడాది ఆమెకు లక్ అంతగా కలిసిరాలేదు. అయినప్పటికీ వరుస ఆఫర్లు అందుకుంటూ విశ్లేషకులకు సైతం షాకిస్తున్నారు శ్రీలీల. కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌కు తోడు బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌లోనూ ఆమె హవా చూపిస్తున్నారు.
2/5
పరాశక్తి కోసం వింటేజ్ లుక్‌లో శ్రీలీల... 1960లలో రత్నమాల ఎలా ఉందో చూశారా? | Parasakthi Actress Sreeleela's Look In Vintage 1960s Style, Featuring Traditional Outfits For Her Character - Filmibeat Telugu
/photos/feature/parasakthi-actress-sreeleelas-look-in-vintage-1960s-style-featuring-traditional-outfits-for-her-character-fb104581.html#photos-1
గతేడాది నితిన్‌తో రాబిన్‌హుడ్, గాలి కిరీటితో జూనియర్, రవితేజతో మాస్ జాతర సినిమాలు చేశారు. కానీ ఇవేవీ బాక్సాఫీస్ వద్ద పాస్ మార్కులు వేయించుకోకపోవడంతో శ్రీలీల కెరీర్ డైలమాలో పడింది. దీనికి తోడు అఖిల్ హీరోగా నటిస్తోన్న లెనిన్ నుంచి శ్రీలీల తప్పుకోవడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
3/5
పరాశక్తి కోసం వింటేజ్ లుక్‌లో శ్రీలీల... 1960లలో రత్నమాల ఎలా ఉందో చూశారా? | Parasakthi Actress Sreeleela's Look In Vintage 1960s Style, Featuring Traditional Outfits For Her Character - Filmibeat Telugu
/photos/feature/parasakthi-actress-sreeleelas-look-in-vintage-1960s-style-featuring-traditional-outfits-for-her-character-fb104581.html#photos-2
ప్రస్తుతం తమిళ స్టార్ హీరో శివకార్తీకేయన్ సరసన పరాశక్తి సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. దీనితో పాటు అనురాగ్ బసు దర్శకత్వంలో తన హిందీ డెబ్యూ మూవీలో నటిస్తున్నారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో. గతేడాది దీపావళికి సినిమా వస్తుందని భావించినా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.
4/5
పరాశక్తి కోసం వింటేజ్ లుక్‌లో శ్రీలీల... 1960లలో రత్నమాల ఎలా ఉందో చూశారా? | Parasakthi Actress Sreeleela's Look In Vintage 1960s Style, Featuring Traditional Outfits For Her Character - Filmibeat Telugu
/photos/feature/parasakthi-actress-sreeleelas-look-in-vintage-1960s-style-featuring-traditional-outfits-for-her-character-fb104581.html#photos-3
ఇవి కాకుండా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్ లాంటి అగ్రనటుడితో నటిస్తుండటంతో ఆమె సంతోషంతో పొంగిపోతున్నారు. ఇప్పటికే పవన్ - శ్రీలీల షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
5/5
పరాశక్తి కోసం వింటేజ్ లుక్‌లో శ్రీలీల... 1960లలో రత్నమాల ఎలా ఉందో చూశారా? | Parasakthi Actress Sreeleela's Look In Vintage 1960s Style, Featuring Traditional Outfits For Her Character - Filmibeat Telugu
/photos/feature/parasakthi-actress-sreeleelas-look-in-vintage-1960s-style-featuring-traditional-outfits-for-her-character-fb104581.html#photos-4
జనవరి 10న శివకార్తీకేయన్ - శ్రీలీలల పరాశక్తి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1960ల నాటి వాస్తవ పరిస్ధితుల ఆధారంగా ఈ సినిమాను ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీలీల.. రత్నమాల అనే పాత్ర పోషిస్తున్నారు. 1960ల నాటి వింటేజ్ లుక్‌లో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.