bredcrumb

Ram Nagar Bunny Total Collections: రామ్ నగర్ బన్నీ టోటల్ కలెక్షన్లు.. లాభమెంత? నష్టమెంత?

By Rajababu A
| Published: Tuesday, October 15, 2024, 23:00 [IST]

నూతన యువ హీరో చంద్రహాస్ నటించిన రామ్ నగర్ బన్నీ సినిమాను మళయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. దివిజ ప్రభాకర్ సమర్పించారు. అక్టోబర్ 4వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే...     

Ram Nagar Bunny Total Box Office Collections
1/5

రామ్ నగర్ బన్నీ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కొంత సానుకూలంగా మారింది. అయితే ఆ టాక్‌ను పూర్తిగా కలెక్షన్ల రూపంలోకి మార్చుకోలేకపోయారని టాక్ ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. కానీ హీరో చంద్రహాస్‌కు మంచి మార్కులే సినీ విశ్లేషకుల నుంచి పడ్డాయి. అయితే ఈ సినిమా కలెక్షన్ల పరంగా నిరాశ పరిచిందనే చెప్పాలి.
Ram Nagar Bunny Total Box Office Collections
2/5

రామ్ నగర్ బన్నీ సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 స్టూడియో సొంతం చేసుకొన్నది. ఈ సినిమా హక్కులను సుమారుగా 1 కోటి రూపాయలు పలికాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా థియేట్రికల్‌గా 50 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 1.5 కోట్లు రికవరీ సాధించింది. ఈ సినిమా సుమారుగా 2.5 కోట్ల మేర నష్టాలను నమోదు చేసుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
Ram Nagar Bunny Total Box Office Collections
3/5

భారీ క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ నగర్ బన్నీ చిత్రం తొలి రోజు 20 లక్షల షేర్ 40 లక్షల గ్రాస్, రెండో రోజు 10 లక్షల షేర్, 20 గ్రాస్, అలాగే మూడో రోజు 10 లక్షల షేర్.. 20 లక్షల గ్రాస్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. దాంతో ఈ సినిమా 80 లక్షల గ్రాస్ వసూళ్లు.. 40 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసే సరికి 50 లక్షల షేర్, 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
Ram Nagar Bunny Total Box Office Collections
4/5

విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర, మురళీధర్, సలీమ్ ఫేకు, మధునందన్ తదితరులు నటించిన ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 4 కోట్ల రూపాయలుగా విలువ కట్టారు.
Ram Nagar Bunny Total Box Office Collections
5/5

ప్రముఖ టెలివిజన్ నటుడు, నిర్మాత, దర్శకుడు ఈటీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ తొలి చిత్ర నటుడిగా పరిచయమవుతూ రూపొందిన చిత్రం రామ్ నగర్ బన్నీ. ఈ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను 5 కోట్ల రూపాయలతో నిర్మించారు.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+