By
Rajesh Karampoori
| Published: Saturday, January 10, 2026, 22:05 [IST]
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’తో కమ్‌బ్యాక్ ఇస్తోంది. టీజర్‌తో పాటు ఆమె లుక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
1/6
బాపు బొమ్మలా మెరిసిన సమంత.. ‘మా ఇంటి బంగారం’తో గ్రాండ్ కమ్‌బ్యాక్! | Samantha Ruth Prabhu Stuns In Traditional Look, Makes Powerful Comeback With Maa Inti Bangaaram - Filmibeat Telugu
/photos/feature/samantha-ruth-prabhu-stuns-in-traditional-look-makes-powerful-comeback-with-maa-inti-bangaaram-fb104587.html
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) మరోసారి వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’( Maa Inti Bangaaram)తో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్–ట్రైలర్‌లో సమంత పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్‌తో పాటు స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ టీజర్‌తోనే సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి.
2/6
బాపు బొమ్మలా మెరిసిన సమంత.. ‘మా ఇంటి బంగారం’తో గ్రాండ్ కమ్‌బ్యాక్! | Samantha Ruth Prabhu Stuns In Traditional Look, Makes Powerful Comeback With Maa Inti Bangaaram - Filmibeat Telugu
/photos/feature/samantha-ruth-prabhu-stuns-in-traditional-look-makes-powerful-comeback-with-maa-inti-bangaaram-fb104587.html#photos-1
టీజర్ రిలీజ్ సందర్భంగా సమంత సింపుల్ అండ్ ఎలిగెంట్ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఫుల్ ఫిదా చేసేశారు. బాపు బొమ్మను తలపించేలా చీరకట్టులో కనిపించిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “బాపు గారి బొమ్మే” అంటూ అభిమానులు కామెంట్లు పెడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. లైట్ మేకప్, మినిమల్ జ్యువెలరీతో సమంత కనిపించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.
3/6
బాపు బొమ్మలా మెరిసిన సమంత.. ‘మా ఇంటి బంగారం’తో గ్రాండ్ కమ్‌బ్యాక్! | Samantha Ruth Prabhu Stuns In Traditional Look, Makes Powerful Comeback With Maa Inti Bangaaram - Filmibeat Telugu
/photos/feature/samantha-ruth-prabhu-stuns-in-traditional-look-makes-powerful-comeback-with-maa-inti-bangaaram-fb104587.html#photos-2
ప్రొఫెషనల్ ఫ్రంట్‌లో చూస్తే.. ‘మా ఇంటి బంగారం’ టీజర్‌లో సమంత చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రత్యేకంగా నిలిచాయి. గతంలో ఆమె చేసిన పాత్రలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైన అవతారం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. శారీరకంగా కఠినమైన సన్నివేశాలు చేయడంలో ఆమె చూపిన కమిట్‌మెంట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో సమంత మరోసారి తన నటనా సత్తాను నిరూపించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
4/6
బాపు బొమ్మలా మెరిసిన సమంత.. ‘మా ఇంటి బంగారం’తో గ్రాండ్ కమ్‌బ్యాక్! | Samantha Ruth Prabhu Stuns In Traditional Look, Makes Powerful Comeback With Maa Inti Bangaaram - Filmibeat Telugu
/photos/feature/samantha-ruth-prabhu-stuns-in-traditional-look-makes-powerful-comeback-with-maa-inti-bangaaram-fb104587.html#photos-3
వ్యక్తిగత జీవితంలో కూడా సమంతలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు. విడాకుల తర్వాత కొంతకాలం సీరియస్‌గా కనిపించిన సమంత, ఇప్పుడు మళ్లీ పాత రోజుల్లా హ్యాపీగా, పాజిటివ్ ఎనర్జీతో కనిపించడం అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది.
5/6
బాపు బొమ్మలా మెరిసిన సమంత.. ‘మా ఇంటి బంగారం’తో గ్రాండ్ కమ్‌బ్యాక్! | Samantha Ruth Prabhu Stuns In Traditional Look, Makes Powerful Comeback With Maa Inti Bangaaram - Filmibeat Telugu
/photos/feature/samantha-ruth-prabhu-stuns-in-traditional-look-makes-powerful-comeback-with-maa-inti-bangaaram-fb104587.html#photos-4
ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోర్ (Raj Nidimoru)తో వివాహం అనంతరం సమంత సంతోషంగా గడుపుతోంది. రాజ్‌తో కలిసి మొదటిసారి పబ్లిక్‌గా కనిపించిన తర్వాత, సమంత ముఖంలో కనిపిస్తున్న సంతోషం అభిమానులను ఆకట్టుకుంటోంది.
6/6
బాపు బొమ్మలా మెరిసిన సమంత.. ‘మా ఇంటి బంగారం’తో గ్రాండ్ కమ్‌బ్యాక్! | Samantha Ruth Prabhu Stuns In Traditional Look, Makes Powerful Comeback With Maa Inti Bangaaram - Filmibeat Telugu
/photos/feature/samantha-ruth-prabhu-stuns-in-traditional-look-makes-powerful-comeback-with-maa-inti-bangaaram-fb104587.html#photos-5
మొత్తానికి, ‘మా ఇంటి బంగారం’ టీజర్‌తో పాటు సమంత ట్రెడిషనల్ లుక్, వ్యక్తిగత జీవితంలో వచ్చిన పాజిటివ్ మార్పులు అన్ని కలిపి ఆమెను మళ్లీ టాప్ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చాయి. ఆరోగ్యం, కెరీర్, వ్యక్తిగత జీవితం అన్నింటిని బ్యాలెన్స్ సాధించిన సమంత, 2026లో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోందన్నది సినీ వర్గాల అభిప్రాయం.