By
Siva Kodati
| Published: Friday, January 16, 2026, 21:03 [IST]
సినీనటి, సంయుక్త మీనన్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా చీరలో స్టైలీష్ లుక్‌లో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.
1/5
నా ఆనందం మాటల్లో చెప్పలేను... నారీ నారీ నడుమ మురారి రిజల్ట్‌పై సంయుక్త మీనన్ | Samyuktha Menon Happy About Nari Nari Naduma Murari Result - Filmibeat Telugu
/photos/feature/samyuktha-menon-happy-about-nari-nari-naduma-murari-result-fb104672.html
తెలుగు చిత్ర పరిశ్రమలో గోల్డెన్ హ్యాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సంయుక్త మీనన్. ఆవిడ నటించిన సినిమాలన్నీ దాదాపుగా హిట్. తాజాగా ఈ సంక్రాంతికి ఆ సెంటిమెంట్ మరోసారి రుజువైంది. తాజాగా సంయుక్త నటించిన నారీ నారీ నడుమ మురారి మూవీ జనవరి 14న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
2/5
నా ఆనందం మాటల్లో చెప్పలేను... నారీ నారీ నడుమ మురారి రిజల్ట్‌పై సంయుక్త మీనన్ | Samyuktha Menon Happy About Nari Nari Naduma Murari Result - Filmibeat Telugu
/photos/feature/samyuktha-menon-happy-about-nari-nari-naduma-murari-result-fb104672.html#photos-1
గత కొన్నేళ్లుగా హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు హీరో శర్వానంద్. ఈ నేపథ్యంలో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. రామ్ టేకింగ్‌తో పాటు కథ, శర్వానంద్ నటన, హీరోయిన్ల గ్లామర్, కామెడీ అన్నీ కలిసి ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
3/5
నా ఆనందం మాటల్లో చెప్పలేను... నారీ నారీ నడుమ మురారి రిజల్ట్‌పై సంయుక్త మీనన్ | Samyuktha Menon Happy About Nari Nari Naduma Murari Result - Filmibeat Telugu
/photos/feature/samyuktha-menon-happy-about-nari-nari-naduma-murari-result-fb104672.html#photos-2
నారీ నారీ నడుమ మురారి చిత్రం విజయవంతం కావడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. సంయుక్త తనతో నటించిన హీరోలకు హిట్స్ ఇస్తుందని అందరూ చెబుతుంటే విన్నా. ఇప్పుడు నాకు కూడా హిట్ ఇచ్చింది. ఆమె అలాగే ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరినీ టచ్ చేస్తూ వెళ్లాలని శర్వా ఆకాంక్షించారు.
4/5
నా ఆనందం మాటల్లో చెప్పలేను... నారీ నారీ నడుమ మురారి రిజల్ట్‌పై సంయుక్త మీనన్ | Samyuktha Menon Happy About Nari Nari Naduma Murari Result - Filmibeat Telugu
/photos/feature/samyuktha-menon-happy-about-nari-nari-naduma-murari-result-fb104672.html#photos-3
అటు సంయుక్త మీనన్ కూడా నారీ నారీ నడుమ మురారి విజయం సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. మా సినిమాకు ఇంత అద్భుతమైన స్పందన చూసి చాలా చాలా థ్రిల్ అవుతున్నాను. సినిమా చూస్తున్నప్పుడు, అందరూ నవ్వుతూ, ఆనందిస్తూ ఉండటం నాకు చాలా సంతృప్తినిచ్చింది అని సంయుక్త పోస్ట్ పెట్టారు.
5/5
నా ఆనందం మాటల్లో చెప్పలేను... నారీ నారీ నడుమ మురారి రిజల్ట్‌పై సంయుక్త మీనన్ | Samyuktha Menon Happy About Nari Nari Naduma Murari Result - Filmibeat Telugu
/photos/feature/samyuktha-menon-happy-about-nari-nari-naduma-murari-result-fb104672.html#photos-4
2026వ సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించిన సంయుక్త.. ఈ ఏడాది మరికొన్ని సినిమాలను విడుదల చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో స్వయంభూ, విజయ్ సేతుపతి - పూరీ జగన్నాథ్ సినిమా, తమిళంలో బెంజ్, హిందీలో మహారాజ్ఞీ: క్వీన్ ఆఫ్ క్వీన్స్, మలయాళంలో రామ్ చిత్రాలలో నటిస్తున్నారు.