bredcrumb

స్టన్నింగ్ లుక్‌లో ది రాజా సాబ్ బ్యూటీ... బ్లాక్‌ డ్రెస్‌లో నిధి గ్లామర్ ట్రీట్

By Siva Kodati
| Published: Thursday, January 8, 2026, 20:33 [IST]

సినీ నటి నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Nidhhi Agerwal Photos
1/5

కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ప్రస్తుతం స్టార్ రేసులో దూసుకెళ్తున్నారు నిధి అగర్వాల్. ఇన్నాళ్లుగా పడుతూ లేస్తూ సాగుతున్న ఈమె సినీ జీవితం గత రెండేళ్లుగా ఊహించమని మలుపు తీసుకుంది. కెరీర్‌లో తొలిసారిగా ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్‌స్టార్స్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నారు నిధి.

Nidhhi Agerwal Photos
2/5

రాజకీయాల్లో బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో పవన్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం సొంతం చేసుకున్నారు నిధి అగర్వాల్. పాలన, రాజకీయాలలో పవన్ బిజీగా ఉండటంతో వీరమల్లు ప్రమోషన్ భారమంతా నిధి తన భుజాలపై మోశారు.

Nidhhi Agerwal Photos
3/5

వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్స్‌తో సినిమాపై హైప్ తగ్గకుండా చూశారు. నిధి అగర్వాల్‌ కష్టం చూసి తనకు సిగ్గేసిందని ఆ అమ్మాయి అంత కష్టపడుతుంటే చూడలేకపోయానని పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారంటే నిధి డెడికేషన్‌ను అర్ధం చేసుకోవచ్చు. సినిమాకు ఆమె ప్రాణం పెడతారని పవర్‌స్టార్ మెచ్చుకున్నారు

Nidhhi Agerwal Photos
4/5

ఈ ఆనందంలోనే నిధి అగర్వాల్‌కు మరో గోల్డెన్ ఆఫర్ దక్కింది. పాన్ ఇండియా స్టార్‌గా, ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న ప్రభాస్‌తో నటించే అవకాశం ఆమె దక్కించుకున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్‌లో ముగ్గురు హీరోయిన్స్‌లో ఒకరిగా నిలిచారు నిధి.

Nidhhi Agerwal Photos
5/5

తాను పనిచేసిన అద్భుతమైన వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరని. ఆయన ప్రతిరోజూ ఇంటి నుంచి రకరకాల వంటకాలు పంపేవారని నిధి అగర్వాల్ చెప్పారు. ఈ సినిమాకు కూడా తానే డబ్బింగ్ చెప్పుకున్నానని ఆమె వెల్లడించారు. జనవరి 9న ది రాజాసాబ్ విడుదల కానుండటంతో నిధి అగర్వాల్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+