Brahmamudi: ఫస్ట్ నైట్ చెడగొట్టేందుకు అనామిక ప్లాన్... కావ్యను మార్చేసిన స్వప్న.. రాజ్, శ్వేత మధ్య గొడవ!
జనవరి 29వ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్య ఆఫీసుకు పోవాలని నిర్ణయం తీసుకుంటుంది. రాజ్, శ్వేత రిలేషన్ ఏంటో తెలుసుకునేందుకు కావ్య.. ఆఫీసుకు వెళ్లాని డిసైడ్ అవుతుంది. ఇంట్లో వాళ్లను అడుగుతుంది. దానికి ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుంది. దీంతో అపర్ణ సపోర్ట్ చేస్తుంది. ఆఫీసుకు వెళ్లమని చెప్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జనవరి 30వ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్య ఆఫీసుకు వెళ్లడంతో.. అనామిక రగిలిపోతూ ఉంటుంది. దీంతో కల్యాణ్ దగ్గరకు వెళ్లి నువ్వు కూడా ఆఫీసుకు వెళ్లమని చెప్తుంది. నాది బిజినెస్ మైండ్ కాదు నేను వెళ్లను అని చెప్తాడు. మరోవైపు కావ్యను ఆఫీసుకు తీసుకుపోకుండా ఇంటి ముందే వదిలేసి వెళ్లిపోతాడు రాజ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

జనవరి 31వ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్య క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అపర్ణ చూసి.. ఏమందని అడుగుతుంది. దీంతో నా కారులో పొమ్మని చెప్తుంది. కావ్య.. అపర్ణ కారులో దర్జాగా ఆఫీసుకు పోతుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత రాజ్.. బలవంతంగా కావ్యకు డిజైనర్ పోస్ట్ ఇస్తాడు. అనంతరం రాజ్ కు శ్వేత నుంచి కాల్ రావడంతో వెళ్లిపోతాడు. కావ్య కూడా ఫాలో అవుతూ పోతుంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఫిబ్రవరి 1వ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్య.. ఆఫీసు నుంచి డల్ గా వస్తుంది. అనామిక వచ్చి.. కాశ్మీరి పూలావ్ నేర్పించమని అడుగుతుంది. దీంతో కావ్య ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్లబోతుంది. ఇంతలో అనామిక వచ్చి రచ్చ చేస్తుంది. కావ్య అక్క అడిగిన నేర్పించవా అంటూ అరుస్తుంది. కావ్యకు ఓపిక నశించి తను కూడా అరుస్తుంది. ఇంతలో ధాన్యలక్ష్మి వస్తుంది. మరోవైపు అపర్ణ కూడా వస్తుంది. గొడవ పెద్దది అవుతుంది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
ఫిబ్రవరి 2వ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్యను వదిలించుకోవడానికి రాజ్ కారణాలు రాస్తానని చెప్పి బోర్డు దగ్గరకు వెళ్తాడు. అక్కడ కావ్య తప్పుల గురించి రాయడానికి ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య రాయమని చెప్తుంది. రాజ్.. ఓ మూడు కారణాలు రాస్తాడు. చెప్పిన మాట వినవు.. ప్రతి విషయంలో నువ్వే పై చేయిగా ఉండాలని చూస్తావ్.. అప్పలమ్మలా తయారు అవుతావు అంటూ కారణాలు చెప్తాడు. దీంతో కావ్య బాగా హర్ట్ అవుతుంది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

ఫిబ్రవరి 3వ తేదీ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో కావ్య కోసం.. స్వప్న మేకప్ సామగ్రిని 70వేల రూపాయలు ఖర్చు చేసి మరీ తెప్పిస్తుంది. అది కూడా రుద్రాణి క్రెడిడ్ కార్డు మీద. కాసేపు రుద్రాణి ఫీల్ అవుతుంటే.. నా కోడలి ఖర్చు నేను ఇస్తాను అంటూ అపర్ణ చెప్తుంది. దాంతో రుద్రాణి కాస్త రిలీఫ్ ఫీల్ అవుతుంది. మరోవైపు స్వప్న.. కావ్యను మెడ్రన్ లుక్ లోకి మార్చేస్తుంది. ఇంట్లో వాళ్లు చూసి బాగుందని చెప్తారు. ఇక అదే లుక్ తో కావ్య ఆఫీసుకు వెళ్తుంది. అక్కడ రాజ్..కావ్యను చూసి షాక్ అవుతాడు. మరోవైపు శ్వేతకు కావ్య ఎదురుపడుతుంది. పూర్తి వివరాలు కోసం లింక్ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications










